సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు దేవతల వేషధారణలో కనిపించి నటించి మెప్పించారు . అయితే ఇప్పటివరకు నటించిన హీరోలలో చాలామంది శివుడు పాత్ర పోషించినప్పుడు ఒరిజినల్ పామును మెడకు వేసుకొని షూట్ చేయలేదు . దానికి రీజన్ ఏంటా..? అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
శివుడు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మెడలో పాము చేతిలో త్రిశూలం . మన ఇళ్లల్లో ఉండే దేవుడి ఫోటోలలో కూడా ముఖ్యంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ రెండు లేకుండా అసలు శివుడి ఫోటోనే ఉండదు . శివుడు పాత్ర ధరించే వ్యక్తి మాత్రం అన్ని ఆభరణాలు పెట్టుకున్న నిజమైన పామును మాత్రం మెడలో వేసుకోవడం చాలా తక్కువ సినిమాల్లో చూస్తుంటాం. సాధారణంగా శివుడి పాత్రులు ధరించే వారికి మెడలో సర్పం వేయడం పరిపాటి .
అయితే దక్షయజ్ఞం , ఉమాచండి గౌరీ శంకరుల కథలో నటించిన నందమూరి తారక రామారావు ఓరిజినల్ సర్పాని ధరించలేదు . మంజునాథ సినిమాలో నటించిన చిరంజీవి కూడా పామును మెడలో వేసుకోలేదు. లోహంతో చేసిన పాముని ధరించారు. శివుడు ముఖ్యపాత్రలో నటించిన శివాజీ గణేషన్ కూడా తీరువిలై యాడల్ లో లోహ సర్పాని వేసుకున్నారు .
అయితే ఎందుకు ఆ నటులు ఒరిజినల్ పాముని మెడలో వేసుకోలేదు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకరిద్దరు నట్లు తప్పిస్తే మిగతావారు ఎవరు కూడా ఆ సాహసాన్ని చేయలేకపోయారు . అసలు శివుడి పాత్రధారి ఎందుకు నిజమైన పామును ధరించరంటే ..శివుడి మెడలో ఉన్న ఆ సర్పం తిన్నగా ఉండదు సరిగ్గా టేక్ జరుగుతూ ఉండగా నెత్తి మీద కైనా ఎక్కవచ్చు కిందకైనా జారిపోవచ్చు దానివల్ల ఇద్దరికీ ప్రమాదమే . అందుకే చాలామంది నటులు ఒరిజినల్ పామును మెడలో వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు..!!