కొన్ని కొన్ని సార్లు మన బ్యాడ్ టైం మన చేత ఎలాంటి పనులైనా చేయిస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా లైఫ్ లో సెటిలైపోయే ఛాన్స్ వచ్చినా సరే అంత సెట్ అయినట్లే .. సెట్ అయ్యి లాస్ట్ మూమెంట్లో కొలాప్స్ అయిపోతూ ఉంటుంది . ఇలా మనలో చాలామందికి జరిగే ఉంటుంది . అయితే ఎగ్జాక్ట్గా ఇదే విధంగా స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివానికి కూడా జరిగింది. ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు వచ్చింది .
ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన పేరెంట్స్ఉన్నా కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు. స్టార్ గా మారలేక పోతుంది.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటిస్తున్న సరే మంచి క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోతోంది . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ విషయాన్ని బయటపెట్టింది శివాని రాజశేఖర్ . “ఉప్పెన సినిమాలో మొదటిగా హీరోయిన్గా ఛాన్స్ తనకే వచ్చింది అని ..లిప్ లాక్ సీన్స్ బోల్డ్ సీన్స్ లో నటించడం ఇష్టం లేకనే వదులుకున్నాను ” అంటూ చెప్పి షాక్ ఇచ్చింది .
ఇంత మంచి సినిమా ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు . అలాంటిది ఆమె ఎందుకు వదులుకుంది అంటూ బాధపడిపోతున్నారు . అంతేకాదు శివాని రాజశేఖర్ ఈ సినిమా చేసి ఉంటే ఆమె కెరియర్ మారిపోయి ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే మరికొందరు మాత్రం శివాని చేసింది కరెక్ట్ అని లిప్ లాక్స్ చేయడం ఇష్టం లేక ఈ సినిమాని వదులుకునింది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . మరి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడమే బెటర్ అంటూ చెప్పుకొస్తున్నారు . శివాని రాజశేఖర్ చేసింది తప్పే అయినా ఆమె అభిమానులకు మాత్రం ఆ తప్పు బాగా నచ్చేసింది..!!