సోగ్గాడుగా ప్రసిద్ధి చెందిన తెలుగు చలన చిత్రరంగం అప్పటి హీరో శోభన్‌బాబు డైరీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. సావిత్రి, అంజలీదేవి మినహా..అ ప్పటి తరం నటీమణులతో ఆయన ఆడిపాడారు. వీరి తర్వాత.. వచ్చిన జయలలిత, వాణిశ్రీ వంటి వారి తోనూ ఆయనకు చాలా దగ్గర అనుబంధం ఉంది. కుటుంబాలు కూడా కలుసుకునేందుకు చనువు, చొరవ కూడా చూపించేవారు. ఒకానొక దశలో జ్యోతిచిత్ర అయితే.. శోభన్‌బాబును నిత్యం చూసేవారని అంటారు. ఆయనను చూడకుండా ఉండలేనని ఆమె చెప్పినట్టు కొన్ని పత్రికలుకూడా రాశాయి.
ఇక, వాణిశ్రీ వంటి నటీమణులు అయితే.. మరింత చొరవగా ఉండేవారు. ఆయనతో కలిసి నటించేందుకు రెమ్యునరేషన్ తగ్గించు కున్న నటీమణులు, కాల్షీట్లను ఖాళీ లేకున్నా.. ఖాళీ చేయించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలా అనేక మంది హీరోయిన్లతో శోభన్‌బాబు ఆడిపాడారు. ఎవరితోనూ ఆయన ఎక్కువగా చనువు చూపించేవారు కాదు. ఎవరితో కలవాలన్నా.. కుటుంబాలతోనే ఆయన కలిసేవారని పేరుంది. ఎందుకంటే.. శోభన్‌బాబు గ్యాసిప్‌లకు కడు దూరంలో ఉండేవారు. చాలా భయస్తుడు కూడా. ఎంతో కష్టపడి తెచ్చుకున్న పేరు పోతుందని ఆయన భయపడిన సందర్భాలు ఉండేవి.
ఇక, శోభన్‌బాబు హీరోయిన్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మూడోతరం నటి.. శారద. ఈమె కూడా శోభన్‌బాబు అంటే ప్రాణం పెట్టేవారు. ఇంటి నుంచి ఆయనకు ఇష్టమైన పప్పుచారు.. ఉప్పు చేపలను చేయించుకుని తెచ్చేవారట. కొసరి కొసరి వడ్డించే వారట. అంత చనువుగా శారద ఎన్టీఆర్, అక్కినేనిలతో కూడా లేరని అప్పటి ఇండస్ట్రీ వర్గాలు చెప్పేవి. శోభన్‌బాబు నటించిన అనేక సినిమాల్లో చిన్న పాత్ర అయినా.. పోషించేందుకు శారద రెడీ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే.. వీరి మధ్య కేవలం తెరమీద స్నేహమే మిగిలిందనేది నిజం. కానీ, గ్యాసిప్‌లు మాత్రం అనేకం ఉన్నాయి. ఇదే విషయాన్ని శారద ఓ సందర్భంగా చెబుతూ.. అనేక విమర్శలు వస్తాయి.వాటిని చూసినవ్వుకోవడమే. అని అన్నారు. మొత్తానికి తెలుగు చలన చిత్ర రంగంలో శోభన్‌బాబును ఇష్టపడని నటీమనులు లేరంటే అతిశయోక్తి కాదు.