ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ మనం అల్లు అర్జున్ పేరు వింటూనే వస్తున్నాం . కొంతమంది ఆయనను పొగుడుతూ ఉంటే మరి కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాగా మరీ ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఆయన గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఆయన పేరు విపరీతంగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు కొందరు జనాలు. పర్టికులర్లీ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎక్కువుగా ఆయనని ట్రోల్ చేస్తున్నారు.
రీజన్ ఏంటో తెలియదు కానీ బన్నీ అంటే విరుచుకు పడిపోతున్నారు. తమ హీరోలకు అలాంటి స్థానం దక్కలేదు అనో..? లేకపోతే బన్నీ అంటే కోపమో..? రీజన్ ఏంటో తెలియదు కానీ కావాలని బన్నికి సంబంధించిన పలు వార్తలను ట్రోల్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు . నిజానికి ఒకప్పుడు అల్లు అర్జున్ అయితే అలాంటి వాళ్లకు తాట తీసేసేవాడు. స్టేజి పైన ఎన్నోసార్లు ఫైర్ అయిపోయిన మూమెంట్స్ కూడా మనం చూసాం .
అయితే అల్లు అర్జున్ ఎప్పుడైతే తనలో కొన్ని మార్పులు చేసుకున్నాడో.. అప్పట్నుంచి అసలు ట్రోల్ చేసే వారిని .. తనను పట్టించుకోని వాళ్ళని పట్టించుకోకూడదు అని డిసైడ్ అయిపోయారట . అందుకే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఎక్కడ కూడా సీరియస్ గా మాట్లాడిన దృశ్యాలు మనం చూడలేదు. అంతేకాదు పలువురు ఆయన మెగా ఫ్యామిలీకి దూరమవుతున్నాడు అని పిచ్చిగా వల్గర్ గా కామెంట్ చేసిన అల్లు అర్జున్ రవ్వంత కూడా స్పందించలేదు. ఆయన పని ఆయన చేసుకుపోతున్నాడు . దీని అర్థం మొరిగే కుక్కలను నేను కంట్రోల్ చేయలేను అనేగా..? అంటూ బన్నీ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు . మొత్తానికి అల్లు అర్జున్ లో ఊహించని ఈ మార్పు అభిమానులకి బాగా ప్లస్ గానే నిలిచింది..!!