టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (79) ఈరోజు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కథానాయకుడు హాస్యనటుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన టాలీవుడ్ లో మొత్తం 975 సినిమాలలో నటించారు. 1945 మే 23న కృష్ణా జిల్లా పమిడి ముక్కల గ్రామంలో చంద్రమోహన్ జన్మించారు.
రంగులరాట్నం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన హీరోగా 175 సినిమాలలో నటించారు. ఆయన కెరీర్లో మొత్తం 932 సినిమాలలో నటించారు. 1987లో చంద్రమామ రావే సినిమాకు సహాయ నటుడుగా అవార్డు అందుకున్నారు. అలాగే 16 ఏళ్ళ వయసు సినిమాలో నటనకు గాను చంద్రమోహన్ కు ఫిల్మ్ పేరు అవార్డు దక్కింది. 2005లో అతనొక్కడే సినిమాలో నటనకు గాను నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
ఆయన నటించిన తొలి సినిమాకే నంది అవార్డు దక్కింది. తెలుగు సినిమా హిస్టరీలో చంద్రమోహన్‌కు ఒక గుడ్ సెంటిమెంట్ ఉండేది. ఆయనతో తొలిసారిగా నటించిన ఏ హీరోయిన్ అయినా ఆ తర్వాత తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోతారన్న సెంటిమెంట్ ఉండేది. ఈ సెంటిమెంటు నిజం చేస్తూ ఎంతోమంది హీరోయిన్లు తిరుగు లేని స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇక ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్, చంద్రమోహన్ ఇద్దరు కజిన్స్ అవుతారు.