హిందీలో లగాన్ సినిమాతో హాట్ టాపిక్ గా మారింది గ్రేసీ సింగ్. ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ ప్రయోగాత్మక చిత్రం అపట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్ఠించింది. క్రికెట్ ఆటను ఆమీర్ టీం ఆడిన విధానం గురించే అందరిలో అప్పట్లో జరిగిన ఆసక్తికరమైన చర్చ. ఈ సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్‌గా గ్రేసీ సింగ్ పరిచయమైంది.
డీగ్లామర్ రోల్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి ఆకట్టుకుంది. ఈ సినిమాలో అంత డీగ్లామర్ రోల్ పోషినప్పటికీ తెలుగులో ఫ్యామిలీ మూవీకి హీరోయిన్‌గా సెలక్ట్ అవడం ఆసక్తికరమైన విషయం. రచయిత దశరథ్ మొదటిసారి దర్శకత్వం వహించిన సంతోషం మూవీకొసం టాలీవుడ్ కి ఫ్రెష్ ఫేస్ కావాలని వెతుకున్నారు. కథ ప్రకారం తెలుగమ్మాయిలా కనిపించాలని మేకర్స్ అనుకున్నారు.
అప్పుడు నాగార్జున లగాన్ సినిమాలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందీ..? దర్శకుడికి చెప్పాడు. వెంటనే గ్రేసి సింగ్ ని కలవడం కథ చెప్పడం ఆమె నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమా అని ఓకే చెప్పడం చక చక జరిగిపోయాయి. ఇంకో రోల్ కోసం నాగార్జున ఆర్తి అగర్వాల్ ని ట్రై చేస్తే డేట్స్ లేక ఆర్తి నో చెప్పింది. దాంతో ఆ రోల్ ఇష్టం సినిమాతో పరిచయమై ఆకట్టుకున్న శ్రియ కి దక్కింది.
సంతోషం సినిమా చేస్తున్నప్పుడే మోహన్ బాబు, శ్రీకాంత్ కలిసి తప్పుచేసి పప్పుకూడు సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా గ్రేసీ సింగ్ ని తీసుకున్నారు. అయితే, ఈ షూటింగ్‌లో గ్రేసీ చాలా ఇబ్బందులు పడిందట. ఏ విషయంలోనో ఇప్పటికే అర్థమై ఉంటుంది. తెలుగులో ఇంత దారుణంగా ఉంటారా..ఇలాంటి వారిని తట్టుకోవడం నా వల్ల కాదు..అని సినిమా కంప్లీట్ అయినన్ని రోజులు తన సన్నిహితుల వద్ద చెప్పుకొని ఫీల్ అయిందట. అంతే, మళ్ళీ తెలుగులో సినిమా అంటే వద్దురా నాయన మీ సినిమా నాకు..అని రిజెక్ట్ చేసిందట.