స్టార్ హీరోయిన్ సమంత చాలాకాలం నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇది ఆటో ఇమ్యూని వ్యాధి… ఒకవైపు ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం సమంత తాను సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం కుదుటపడే వరకు దాని మీద దృష్టి సారిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధికి చికిత్స కోసం సమంత అమెరికా వెళ్లి అక్కడ కొద్ది రోజులపాటు ట్రీట్మెంట్ కూడా తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సమంత తన ఆరోగ్యం సంబంధించి ఓ చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. కైరో థెరపీ సెషన్‌కు తాను హాజరైనట్టు చెప్పింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టేటస్ లో ఓ ఫోటో కూడా షేర్ చేసింది. ఆ ఫోటోలో సమంత పొగలు కక్కే 150 డిగ్రీల ఫారెన్ హీట్ లో కూర్చుని ఉంది. మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టం సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఈ థెరపీ సహాయపడుతుందని సమంత రాసింది.
ఇన్ఫెక్షన్తో పోరాడే వైట్ బ్లడ్ సెల్స్ ను ఈ తెరఫీ పెంచుతుంది.. బ్లడ్ ప్రో అయ్యేలా చేసి.. శరీరం మొత్తం హీలింగ్ కాంపౌండ్స్ సరిపడా చేస్తుందని.. మెంటల్ హెల్త్‌తో పాటు ఎనర్జీ ఇస్తుంది శరీరంలో ఎన్ని మార్పులు చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని సమంత రాసుకోచ్చింది. ఇక సమంత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
అలాగే హాట్ హాట్ ఫోటోషూట్లతో కూడా ఫాలోవర్లను కలుస్తూనే ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత త్వరలోనే వరుణ్ ధావన్ తో కలిసి చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించనుంది.