పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ సలార్. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు నేషనల్ వైడ్‌గా ఇలాంటి క్రేజ్ ఉందో చూస్తున్నాం. అలాంటిది క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో సలార్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. క్రిస్మస్ హాలిడేస్ సందర్భంగా డిసెంబర్ 22న సలార్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్ళు చెదిరిపోయే స్థాయిలో జరుగుతుంది.
తాజాగా సలార్ ఓటీటీ హక్కులు భారీ మొత్తం పలికినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఓసారి సలార్ ఓటీటీ హక్కులకు కళ్ళు చెదిరే డీల్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్ రూ.160 కోట్లు ఇచ్చి మరి సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. సలార్ సినిమా తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ తో కొద్ది రోజుల క్రిందట నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.
నిజం చెప్పాలంటే బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత మూడు వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పేందుకు ఈ ఓటీటీ డీల్ నిదర్శనం అని చెప్పాలి. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అంచనాలు అందుకోలేదు. అందులోనూ రాధేశ్యామ్, ఆదిపురుష్ అయితే పెద్ద డిజాస్టర్లు. అయినా అటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కావడంతో సలార్ పై అంచనాలు మామూలుగా లేవు.
నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాలతో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. ఇక ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి కెరీర్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ ఖాన్ డుంకీ సినిమా కూడా క్రిస్మస్ కానుకగా వస్తోంది. ఏది ఏమైనా క్రిస్మస్ కానుకగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల వార్ మామూలుగా ఉండదని చెప్పాలి.