ప్రభాస్ అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్న సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కాలంటే అలవైకుంఠపురంలో. కేజిఎఫ్ సినిమాలకు మించిన హిట్ అవ్వాలి. ఆ రేంజ్‌లో ఈ సినిమా హిట్ కాకపోతే బయర్లు సేఫ్ కావడం అనేది అసాధ్యం. అసలు ఆంధ్రాలో ఏరియాలవారీగా సలార్ సినిమా రైట్స్ చూస్తే జుట్టు పీక్కోవాలి. కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి.
సీడెడ్ మినహా ఆంధ్ర ఏరియాను రూ.80 నుంచి రూ.85 కోట్ల రేయోషోలో మార్కెట్ చేశారు. అంతమొత్తం రావాలంటే సీడెడ్ కాకుండానే ఆంధ్రాలో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ రావాలి. రూ.85 కోట్ల మీర బయ్యర్లకు కమీషన్లు రావాలంటే రూ.100 కోట్లు కావాలి. ఆ పైన ఖర్చులు, థియేటర్ రెంట్ అన్ని పోవాలి. అలవైకుంఠపురంలో లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ఉత్తరంధ్రలో రూ.20 కోట్లు, నైజంలో రూ.42 కోట్లు వసూలు చేసింది.
ఇప్పుడు సలార్ సినిమా నైజాంలో రూ.70 కోట్లకు పైగా.. ఉత్తరంధ్రలో రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించాలి. అంటే ఆర్.ఆర్.ఆర్ రేంజ్ హిట్ కావాలి. అంత హిట్ అయితే తప్ప బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కావటం కష్టం. సలార్ పెద్ద హిట్ అయితే ఇంకో సమస్య ఉంటుంది. సలార్ బయర్లు టార్గెట్ చేరాలి అంటే కనీసం నాలుగు వారాలు బీభత్సంగా ఆడాలి. సినిమా హిట్ అయితే తప్పకుండా ఆడుతుంది.
అలా ఆడితే ఆ ప్రభావం సంక్రాంతికి వస్తున్న సినిమాల మీద ఖచ్చితంగా ఉంటుంది. సంక్రాంతి కూడా ఓ బలమైన పోటీగా థియేటర్లలో ఉంటుంది. అప్పుడు కచ్చితంగా సంక్రాంతి సినిమాలకు ఎఫెక్ట్ పడుతుంది. ఆర్‌ఆర్ఆర్ తర్వాత తెలుగులో ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా ఏది లేదు. ఇప్పుడు సలార్ ఆ రేర్ రికార్డు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ సలార్ ఆ స్థాయిలో వసూళ్లు సాధిస్తే ఎగ్జిబిటర్లకు పండగే పండగ అని చెప్పాలి.