చాలామంది హీరోయిన్స్ తెలుగు ఇండస్ట్రీలో పాపిలారిటీ తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్ళి ఏలాలని ఆశపడుతుంటారు. అంతేకాదు, ఉండేది ముంబై అయినా కూడా కన్ను ఎప్పుడూ టాలీవుడ్ మీదే ఉంటుంది. అంతేకాదు, ఇక్కడ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళూ ఉన్నారు. కానీ, అలా అందరూ సక్సెస్ కాలేదు. కొందరు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళూ ఉన్నారు.
అలాంటి వారిలో రీమా సేన్ ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా చిత్రం. ఈ సినిమాతో ఉదయ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత రీమా సేన్ మనసంతా నువ్వే, వీడే లాంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. చిత్రం, మనసంతా నువ్వే తర్వాత రీమా సేన్ కి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ, ఎందుకో ఆమె అన్నీ సినిమాలను ఒప్పుకోలేదు.
అదే సమయంలో ఎక్కువగా రీమా సేన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఆశలు పెట్టుకుంది. అక్కడ ఫర్దీన్ ఖాన్ తో ఒక సినిమా కూడా చేసింది. ఆ సినిమా హిందీలో యావరేజ్‌గా ఆడింది. దాంతో హిందీలో రీమా సేన్ కి హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. ఇక్కడ చూస్తే అప్పటికే చాలామంది కొత్త హీరోయిన్స్ వచ్చి ఫాంలో కొనసాగారు. అదే సమయంలో రీమా సేన్ ఫిజికల్ గా కూడా చాలా మారింది.
ఫేస్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. దాంతో అటు హిందీలో, ఇటు తెలుగులో హీరోయిన్‌గా ఛాన్సులు రాకపోవడంతో తెరమరుగైంది. హిందీ వైపు గనక చూడకుండా రీమాసేన్ తెలుగులో గనక మంచి సినిమాలు ఎంచుకొని కొనసాగితే కనీసం ఓ పదేళ్ళు మంచి ఫాంలో ఉండేది. బాలీవుడ్ అని ఆశపడి అవకాశాలు లేక కనిపించలేదు రీమాసేన్.