News"రాహుల్ తో రతిక కు ఉన్న సంబంధం అదే.. పెళ్లికి కూడా...

“రాహుల్ తో రతిక కు ఉన్న సంబంధం అదే.. పెళ్లికి కూడా వచ్చాడు”..కుండ బద్ధలు కొట్టేసిన రతిక తండ్రి..!!

రతిక.. గతంలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపింది అని.. వాళ్ళు క్లోజ్ గా దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన పేరు చెప్పుకొని కూడా కొన్నాళ్లు హౌస్ లో నెట్టుకొచ్చింది అన్న కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి . అయితే రతిక చాలా అవకాశవాది అని.. ఎవరు దొరికితే వాడితో ప్రేమాయణాలు నడిపి వాడుకోవడానికి చూస్తుంది అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ఆమెను నిందిస్తూ కామెంట్స్ చేశారు.

దీంతో రతిక పేరెంట్ స్ అలాంటి మాటలు తట్టుకోలేక రియాక్ట్ అయ్యారు. రతిక తండ్రి రాములు తల్లి అనిత.. రతిక రాహుల్ మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు . “ఇంటర్ సెకండియర్ లో ఉన్నప్పుడు విజయనిర్మల తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందట . మహేష్ తల్లి సినిమా అని తెలిసి షూటింగ్ కి వెళ్ళిందట . కానీ సినిమా ఆగిపోయింది . ఈ క్రమంలోనే రాహుల్ తో పరిచయం ఏర్పడి రెండు మూడు పాటలు రతిక తో చేశాడట ..అలా ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోయింది”.

“మా చిన్నమ్మాయి పెళ్లికి కూడా రాహుల్ వచ్చాడు” అంటూ రతిక పేరంట్స్ చెప్పుకొచ్చారు. అయితే పెళ్లిపై మాత్రం మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని.. ఒక రోజు మేమే అడిగామని ..”మా అమ్మాయికి పెళ్లి కావాలి .. ఇలాంటి పాటలు తీస్తే ఎలా అని ..ఆయనతో గట్టిగా మాట్లాడమని చెప్పుకొచ్చాడు”. అంతేకాదు “రతిక రాహుల్ మధ్య అలాంటిది ఏదీ లేదని ..రతిక అందరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది అని ..పల్లవి ప్రశాంతతో కూడా అదే విధంగా స్నేహితుడి లాగా మాట్లాడుతుందని ..కానీ బయట వాళ్ళు తప్పుడు తప్పుడుగా మాట్లాడుకుంటున్నారని .. అది మాకు చాలా బాధగా ఉంది” అంటూ చెప్పుకు వచ్చారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news