Newsఒక్క రోజు షూటింగ్‌కి బ్రేక్ వచ్చిన.. రష్మిక ఎక్కడికి వెళ్తుందో తెలుసా..?...

ఒక్క రోజు షూటింగ్‌కి బ్రేక్ వచ్చిన.. రష్మిక ఎక్కడికి వెళ్తుందో తెలుసా..? ఎట్టకేలకు అసలు నిజాని కక్కించిన బాలయ్య..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం గమనించవచ్చు. మరీ ముఖ్యంగా ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్న సరే ఆమె క్రేజ్ మాత్రం ఏ రేంజ్ లో తగ్గడం లేదు . రీసెంట్గా ఆమె నటించిన సినిమా యానిమల్ . ఈ సినిమా డిసెంబరు ఒకటి న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి వచ్చింది యానిమల్ మూవీ టీం. ఈ క్రమంలోనే బాలయ్య సందీప్ రెడ్డివంగా , రణబీర్ కపూర్ , రష్మిక మందన్నా ను ఓ ఆట ఆడేసుకున్నారు . మరి ముఖ్యంగా రష్మిక – విజయ్ దేవరకొండ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టడానికి చాలా చాలా ట్రై చేశారు . కానీ ఈ జంట కూల్ గా తప్పించేసుకునింది.

అయితే బాలకృష్ణ ఈ షోలో మాట్లాడుతూ ..”రష్మికకు షూటింగ్ లేకపోతే ఏం చేస్తుంది .. ? ఎక్కడ కలుసుకోవచ్చు ఆమెను ..?” అంటూ ప్రశ్నిస్తారు . దీనికి రన్బీర్ అండ్ సందీప్ రెడ్డివంగా ఇద్దరు ఒకే ఆన్సర్ ఇస్తారు . “ఆమెకు షూటింగ్ లేకపోయినా ఏమాత్రం తీరిక దొరికిన ఆమె కచ్చితంగా అక్కడే ఉంటుంది .. అదే జిమ్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో రష్మిక మందన్నా ఫిజిక్ కోసం ఎంత కష్టపడుతుంది అనేది మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news