టాలీవుడ్ సీనియర్ హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ అంటేనే ఒకప్పుడు పోలీసు సినిమాలకు కేరాఫ్. వరుస పోలీస్ స్టోరీలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేవాడు. అంకుశం, ఆహుతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత రాజశేఖర్ నుంచి మరో యాంగ్రీ పోలీస్ పాత్రలో సినిమా వస్తుందని అందరూ ఊహించారు. ఎవరు అంచనాలకు అందకుండా రాజశేఖర్ అనూహ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లరి ప్రియుడు వంటి ఒక రొమాంటిక్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
అల్లరి ప్రియుడు సినిమా రాజశేఖర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా చెప్పాలి. రాజశేఖర్ తో సినిమా చేయాలన్న ఆలోచన మొదటి నుంచి రాఘవేంద్రరావుకి ఉండేది. దీంతో ఒకరోజు రాజశేఖర్‌ను పిలిపించుకొని తన దగ్గర ఉన్న లవ్ స్టోరీ లో నటించాలని కథ చెప్పడంతో రాజశేఖర్ ఒకే చెప్పాడట. కానీ సినిమాలో రొమాన్స్‌తో పాటు.. పాటలు ఎక్కువగా ఉన్నాయి. తనలాంటి ఒక హీరోకి అవి సూట్ కావని రిస్క్ ఎందుకు ? తీసుకుంటారని కూడా రాఘవేంద్రరావుని రాజశేఖర్‌ని ప్రశ్నించాడట.
వెంటనే రాఘవేంద్రరావుకి కోపం రావడంతో పాటు నీకెందుకు అవన్నీ.. నువ్వు సినిమా లో నటిస్తే చాలు నీకు ఇష్టమైతే నటించు లేదంటే లేదు.. అని కరాకండిగా చెప్పేసారట. అయితే రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు సినిమా రిజెక్ట్ చేయటం ఇష్టం లేక వెంటనే రాజశేఖర్ ఓకే చెప్పేసారట. అయితే ఆ సినిమాలో నటిస్తున్నంత సేపు ఆ రొమాంటిక్ సీన్లు, ఆ డ్యూయెట్లు చూసి సినిమా ఖచ్చితంగా డిజాస్టర్ అవుతుందని రాజశేఖర్ మనసులో అనుకునే వాడట.
అప్పటివరకు తనని అన్ని పాటల్లో అంత అందంగా ఎవరూ చూపించలేదు… నన్ను ఎవరు ? పాటలు, రొమాంటిక్ సీన్లలో చూడనే చూడరు అని తన మనసులో అనుకునేవాడట. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ అల్లరి ప్రియుడు సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది. అసలు రాజశేఖర్‌తో ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీ.. డ్యూయెట్లు పెట్టి సినిమా తీయటం ఏంటి ? అని సినీ జనాలు ఆశ్చర్యపోయారు. సినిమా విడుదలయ్యాక సైతం రాజశేఖర్ కు ఇది యావరేజ్ సినిమా అవుతుందని నమ్మకమే ఉండేదట. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ అయింది.