News"నాలాంటి వాళ్లతో ప్రభాస్ ఫ్రెండ్ షిప్ చేయడు".. హీట్ పెంచేస్తున్న రణబీర్...

“నాలాంటి వాళ్లతో ప్రభాస్ ఫ్రెండ్ షిప్ చేయడు”.. హీట్ పెంచేస్తున్న రణబీర్ హాట్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . రన్బీర్ కపూర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా అనిమల్ . ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశారు . రష్మిక మందన్నా.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది .

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం యానిమల్ మూవీ టీం అన్ స్టాపబుల్ షో కి వచ్చారు . ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో రన్బీర్ కపూర్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అంటూ గెస్ చేయాలి అని రష్మిక మందన్నా.. సందీప్ రెడ్డి వంగాను ప్రశ్నించారు బాలకృష్ణ . దీంతో వారు స్లేట్లపై వారి పేర్లు రాస్తారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తాను సందీప్ రన్బీర్ కు క్లోజ్ ఫ్రెండ్ అని రష్మిక రాస్తారు. ప్రభాస్ అని సందీప్ రెడ్డి వంగ రాస్తారు . రన్బీర్ కూడా దీనిపై స్పందిస్తాడు .

ప్రభాస్ ప్రస్తుతం తన క్లోజ్ ఫ్రెండ్స్ ల జాబితాలో లేరని చెప్పుకొస్తాడు . అంతేకాదు ప్రభాస్ తో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందని ..కానీ ప్రభాస్ నాతో ఫ్రెండ్షిప్ చేయరు అని నేను ఆయనకి పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చాడు . అంతేకాదు సందీప్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చిన కళ్లకు అద్దుకొని మరీ చేస్తాను అని చెప్పుకొచ్చాడు . దీంతో ప్రభాస్ – రణబీర్ మధ్య ఏమైనా ఇన్నర్ వార్స్ ఉన్నాయా ..? ప్రభాస్ ఎందుకు రన్బీర్ తో ఫ్రెండ్షిప్ చేయడు ..?అనే విషయాలు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news