యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి వెండితెరపై విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న నటి అనసూయ. జబర్దస్త్ కామెడీ షో తో బుల్లితెరపై తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ పూర్తిగా మారిపోయింది. రీసెంట్గా ఆమె ప్రేమ విమానం సినిమాలో తన అభిమానులను అలరించింది. ఇక మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ రకరకాల కామెంట్లు, హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది.
ఇక అనసూయ ఇటు బుల్లితెర నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చాక సినిమాలతోనూ బాగా పాపులర్ అవుతుంది. అయితే ఆమె తన తాజా ఇంటర్వ్యూలో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన పక్కన నటించే ఛాన్స్ వచ్చిన వదులుకున్న విషయాన్ని చెప్పింది. అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్‌లో పవన్ పక్కన డ్యాన్స్ చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ పాటలో చాలామంది హీరోయిన్లు ఉన్నారని తెలిసి తాను చేయనని చెప్పేసానని.. త్రివిక్రమ్‌కు సారి కూడా చెప్పానని తెలిపింది.
ఇక గుంపులో నటించడం నాకు నచ్చదు.. నాకంటూ స్పెషాలిటీ ఉండాలని కోరుకుంటా.. అందుకే ఆ పాటకు నో చెప్పానని.. ఆ టైంలో తనపై చాలా విమర్శలు వచ్చిన తాను మాత్రం వెనుక తగ్గలేదని అనసూయ తెలిపింది. తాను మొదటి నుంచి ముక్కుసూటి మనిషిని.. కొంచెం కఠినంగానే పవన్ సినిమాలో చేయనని చెప్పేసా.. దీనిపై కొందరు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. అందుకే త్రివిక్రమ్‌కి సారీ చెప్పినట్టు అనసూయ తెలిపారు.
ఇక హీరోయిన్ ఛాన్స్ రాకపోవడం పై స్పందిస్తూ షూటింగ్స్ లో నా పని అయిపోగానే వెళ్ళిపోతా.. సినిమా అయ్యాక పార్టీలకు దూరం… అందువల్ల హీరోయిన్ ఛాన్సులు కోల్పోయా అని.. అలా చేస్తేనే అవకాశాలు వస్తాయంటే వాటిని ప్రోత్సహించనని అనసూయ తెలిపారు. అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.