Newsదుర‌దృష్టాన్ని హ్యాండ్‌బ్యాగులో పెట్టుకు తిరుగుతోన్న ప‌వ‌న్ హీరోయిన్‌..!

దుర‌దృష్టాన్ని హ్యాండ్‌బ్యాగులో పెట్టుకు తిరుగుతోన్న ప‌వ‌న్ హీరోయిన్‌..!

కొంతమందికి కావాల్సినంత అందం, టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం లేక కింద మీద పడుతూ ఉంటారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఈ అమ్మాయి గ్లామర్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఎటు వచ్చి ఆమెకు ఆవగింజంత అదృష్టం అయితే లేదని చెప్పాలి. ఎంత పెద్ద క్రేజీ ప్రాజెక్టుల‌లో.. ఎంత పెద్ద స్టార్ హీరోలు సినిమాలలో నటించినా అనుకు కాలం కలిసి రావడం లేదు. తెలుగులో ఆమె నాని సరసన నటించి సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలలో ఆఫర్లు వచ్చాయి.

వీరిద్దరి సినిమాలలో అవకాశాలు అంటే ఎలాంటి హీరోయిన్ ? అయినా కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నాం. కానీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఆమెకు పీడకల లాంటి సినిమాలు మిగిల్చారు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో అజ్ఞాతవాసి సినిమాలో అను ఇమ్మాన్యుయల్ నటించింది. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ? అయిందో చూసాం. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్ పరువు పోయింది. ఆ సినిమా అనుకు మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. ఇక బన్నీతో చేసిన నా పేరు సూర్య సినిమా కూడా పెద్ద డిజాస్టర్.

ఇలా మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో చేసిన ఆమెకు కాలం కలిసి రాలేదు. అయితే అనూహ్యంగా మరో మెగా హీరో అల్లు శిరీష్ కు ఆమె దగ్గర కావడంతో పాటు అతడితో ప్రేమాయణం నడుపుతుంది అన్న పుకార్లు కూడా వచ్చాయి. అది కూడా ఆమె కెరీర్‌కు పెద్దగా హెల్ప్ కాలేదు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ జోడిగా జపాన్ సినిమాలో నటించింది. ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ అయింది.

తమిళనాట కూడా జపాన్ కంటే జిగ‌ర్తాండా డ‌బుల్ ఎక్స్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. తెలుగులో జపాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో కనీసం కార్తీ అయినా ఆదుకుని తన కెరీర్‌కు హెల్ప్ అవుతాడు అనుకుంటే అనూని నిండా ముంచేశాడు. జపాన్‌తో అను ఆశ‌లు మొత్తం గల్లంతయ్యాయి. ఇలా కెరీర్ స్టార్టింగ్ నుంచి అను ఇమ్మానుయేల్ దురదృష్టాన్ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతోంది. ఇప్పటికే ఆమెపై ఐరన్ లెగ్.. ప్లాప్ హీరోయిన్ అన్న ముద్ర పడిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ లోనూ అదే రిపీట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news