చాలామంది అనుకుంటూ ఉంటారు .. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక అసలు కష్టాలు ఉండవని ..అటు చూసిన ఇటు చూసిన డబ్బే కనిపిస్తుంది అని .. చిటికెలో ఏ పననైనా జరిపించుకునే స్టేటస్ అందుకోవచ్చు అని .. కానీ అది తప్పు అంటూ చెప్పుకొస్తుంది సీనియర్ యాక్ట్రెస్ అన్నపూర్ణమ్మ . సినిమా ఇండస్ట్రీలో ఉండే నటులకి కూడా ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి అని ఆమె రీసెంట్గా వచ్చిన సుమా అడ్డ షోలో బయటపెట్టారు .
అన్నపూర్ణమ్మ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సీనియర్ నటి మనలో ఒకరుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. రీసెంట్గా సుమా అడ్డ షో కి వచ్చింది అన్నపూర్ణమ్మ . దీనికి సంబంధించిన ప్రోమో కూడా నెట్టింట వైరల్ గా మారింది. సుమ అడ్డ షోలో అన్నపూర్ణమ్మ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అన్నపూర్ణకు పిల్లలు లేకపోతే కొన్నేళ్ళ క్రితమే కీర్తి అనే ఓ పాపను దత్తత తీసుకునింది .
మంచిగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి కూడా చేసి పంపించింది. అయితే కీర్తికి కూడా ఇంకో పాప పుట్టింది . ఆ పాపకు పుట్టుకతోనే మాటలు రాలేదు ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన సమస్య తీరలేదట .ఈ విషయంలో కీర్తి బాగా బెంగపెట్టుకొని మానసికంగా బాధపడిపోయింది . ఆ బాధతో ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది . ఈ విషయాన్ని గుర్తు చేసుకుని అన్నపూర్ణమ్మ ఎమోషనల్ అయింది. “ఆ రోజు బజ్జీలు చేసి ఇచ్చాను .. రెండు తిని చాలా మమ్మీ అత్తగారు ఊరు వెళ్తున్నారు అంటే.. మా ఇంట్లోనే పడుకోమన్నాను .. కానీ వాళ్ళ ఆయన ఉన్నాడు కదా అని వెళ్ళిపోయింది ..తెల్లవారుజామున చనిపోయింది . అసలు ఉరి వేసుకుంటుందని ఆలోచన కూడా నాకు రాలేదు “అంటూ గట్టిగా ఏడ్చేసింది . దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది..!!