News' వార్ 2 ' లో ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్‌... ఎలివేష‌న్...

‘ వార్ 2 ‘ లో ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్‌… ఎలివేష‌న్ భ‌యంక‌రం… భీక‌రం… చూస్తారా…!

ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి మామూలుగా లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు య‌శ్‌రాజ్‌ ఫిలిమ్స్ స్పై వరల్డ్‌లోకి తారక్ ఎంట్రీ వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి. దీనిపై ఎట్టకేలకు పూర్తి స్పష్టత వచ్చేసింది. హృతిక్ రోషన్ హీరోగా రాబోతున్న వార్ 2 సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాతో ఈ మేరకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

సల్మాన్ హీరోగా నటించిన టైగర్ 3 పోస్టు క్రెడిట్ సీన్‌లో వార్‌2 కు సంబంధించి నిర్మాతలు లీడ్ ఇచ్చారు. కబీర్ ( హృతిక్ రోషన్)కు క‌ల్న‌ల్ లుద్రా ( అషుతోష్ రాణ) కాల్ చేస్తాడు.. ఓ భయంకరమైన వ్యక్తిని పరిచయం చేస్తాడు. ఇండియాకు కొత్త శత్రువు రెడీ అయ్యాడు..? ఇప్పటివరకు ఎవరూ చూడని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అతడు.. ఎలా ఉంటాడో తెలియదు..? పేరు కూడా తెలియదు..? పూర్తిగా చీకట్లోనే ఉంటాడు.. అతడిని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా చీకట్లోకి వెళ్లాలంటూ హృతిక్‌కు చెప్పే సీన్ అది.

అతడితో పోరాటం మరణం కంటే ప్రమాదం అంటూ.. ఎన్టీఆర్ ఎంట్రీ వార్2 లో ఎలా ఉండబోతుందో భయంకరమైన ఎలివేషన్ ఇచ్చేశారు. నేరుగా ఎన్టీఆర్ పేరు చెప్పకపోయినా ఆ ఎలివేషన్ మొత్తం తారక్‌ పాత్రదే అన్న విషయం ఆడియన్స్ కు అర్థమైంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నాడు అనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. ఆ మ్యాటర్ ఈరోజు ఎట్టకేలకు కన్ఫర్మ్ అయింది.

ఎన్టీఆర్‌కు నెగిటివ్ షేడ్స్‌లో కనిపించడం కొత్తకాదు. జై లవకుశ సినిమాలో ఓ క్యారెక్టర్ లో అతడు నెగిటివ్గా కనిపించాడు. అయితే యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై వరల్డ్ లో విల‌న్‌లు కూడా అప్పుడప్పుడు హీరోలు గానే కనిపిస్తారు. అయితే వార్‌2 లో ఎన్టీఆర్ పాత్ర భయంకరమైన ఎలివేషన్లతో ఉంటుందని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news