సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ కూడా ఘాటుగా మాట్లాడటం నేర్చుకున్నారు . ఎదుటివారికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో.. అదే విషయాన్ని చెబుతూ ఇచ్చి పడేస్తున్నారు. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది బాలీవుడ్ బ్యూటీ పాయల్ గోష్ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో నటించి మెప్పించింది .
ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఊసరవెల్లి బ్యూటీ నే అంటూ ఈమెను గుర్తు పెట్టుకున్నారు . తమన్న ఫ్రెండ్ గా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది . ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది . రీసెంట్ గా పాయల్ ఘోష్ బాలయ్యను ఓ రేంజ్ లో పొగిడేసింది . బాలీవుడ్ హీరోలకి ఇచ్చి పడేస్తూ “బాలకృష్ణ సార్ ని చూసి నేర్చుకోండి. ఈ వయసులోనూ సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నాడు ..అది హీరోయిజం అంటే అనేలా ట్విట్ చేసింది”.
దీనితో బాలీవుడ్ హీరోస్ కి ఘాటుగా ఇచ్చి పడేసింది పాయల్ అని సౌత్ హీరోలను తక్కువగా చూసే నార్త్ హీరోలకు పాయల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఈ ట్వీట్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఆమె కాదు చాలామంది బాలయ్యను పొగిడేస్తున్నారు . ఈ వయసులోనూ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ఇంత కష్టపడుతున్నాడని రియల్ హీరోకి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అదే అంటూ ఓ రేంజ్ లో బాలయ్యను పొగుడుతున్నారు..!!