Movies"అందరి ముందు అలాంటి ప్రశ్న అడిగిన అభిమాని".. నాని జబర్ధస్త్ ఆన్సర్...

“అందరి ముందు అలాంటి ప్రశ్న అడిగిన అభిమాని”.. నాని జబర్ధస్త్ ఆన్సర్ వింటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ హీరో నాని అంటే జనాలు ఏ రేంజ్ లో పడి చచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు చాలామంది పెద్దపెద్ద హీరోలకి డై హార్ట్ ఫ్యాన్లుగా ఉంటారు . అయితే నానికి కూడా బోలెడు మంది హీరోలు హీరోయిన్లు బిగ్ ఫ్యాన్స్ . రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా “హాయ్ నాన్న” . ఈ సినిమా డిసెంబర్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు నాని .

రీసెంట్గా హైదరాబాదులోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో ఓ ఇంటర్వ్యూ సెషన్ నిర్వహించారు. దీంతో నాని ఫాన్స్ చాలామంది విద్యార్థులు ఆయనను రకరకాల ప్రశ్నలు అడిగారు . అయితే అందరిలోకి నాని బిగ్ ఫ్యాన్ ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేశాడు. ఆ అబ్బాయి మాట్లాడుతూ..” నాని అన్న మీరు చిన్న చిన్న దర్శకులతో ఎందుకు మూవీస్ చేస్తున్నారు . మీరు తలుచుకుంటే బడా డైరెక్టర్ తో కూడా చేయొచ్చు .. మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు “.

దీనికి ఆన్సర్ ఇస్తూమీరు ..”మీరు బడా బడా హీరోలు సినిమాలో చూడొచ్చుగా ఎందుకు నా సినిమా కోసమే థియేటర్ వెళ్లి చూస్తున్నారు .. మనసుకు నచ్చిన పని చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం అంతే .. అలాగే మనసుకు నచ్చిన మూవీస్ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను .. మీరు నన్ను ఎలా ఆదరిస్తున్నారు .. నేను డైరెక్టర్స్ ను అలానే నమ్ముతాను” అంటూ కూల్ ఆన్సర్ ఇచ్చాడు . దీంతో నాని ఆన్సర్ వైరల్ గా మారింది కొందరు మా నాని అన్న ఎంత మంచోడో అంటూ కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news