టాలీవుడ్లో చాన్నాళ్లుగా కెరీర్ కొనసాగిస్తూ వస్తోంది మెహ్రీన్. అయితే మెహ్రీన్ మూడు, నాలుగు సినిమాలు మాత్రమే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎఫ్ 2తో పాటు ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ లేదు. ఎఫ్ 2 సినిమాలో మెహ్రీన్ పోషించిన హనీ పాత్రకు మంచి పేరు వచ్చింది. మెహ్రీన్ ఇప్పటకీ ఏ ఫంక్షన్‌కు వెళ్లినా కూడా హానీ ఈజ్ ద బెస్ట్ అని పిలుస్తూ.. ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు మెహ్రీన్ తనను హానీ అని కాకుండా లేఖ అని పిలుస్తూ ఉంటారని మెహ్రీన్ చెపుతోంది. అసలు విషయం ఏంటంటే స్పార్క్ అనే సినిమాలో లేఖ అనే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తనకు లైఫ్ టైమ్ గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తోంది ఈ అమ్మడు. స్పార్క్ మూవీలో తాను లేఖ అనే పాత్రలో నటిస్తున్నానని.. ఇది సినిమాలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ అని… సినిమా నాతోనే స్టార్ట్ అవుతుంది.. నాతోనే ఎండ్ అవుతుందని కూడా మెహ్రీన్ తెలిపింది.
ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో నటించడం నాకు ఆనందంగా ఉందని కూడా తెలిపింది. నిన్న మొన్నటి వరకు తనను హానీ, మహాలక్ష్మి అనే పాత్రల్లో పిలిచానని.. ఇకపై తనను లేఖ అని పిలుస్తారని మెహ్రీన్ కాన్ఫిడెంట్‌తో చెపుతోంది. ప్రస్తుతం మెహ్రీన్ చేతుల్లో సినిమాలు లేవు. ఆమె చేతిలో ఉన్న ఒకటీ అరా సినిమాల్లో ఇది కూడా ఒకటి.
ఈ సినిమా కూడా కొత్త హీరోతో చేస్తోంది. ఏ మాత్రం తేడా కొట్టినా అసలు మెహ్రీన్‌ను ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే ఈ సినిమాకు హైప్ తెచ్చేందుకే ఆమె ఇంతలా లేపుకుంటోందని అంటున్నారు. మరీ మెహ్రీన్ స్పార్క్ హిట్ అయ్యి ఆమె కెరీర్‌కు ఊపు ఇస్తుందో లేదో చూడాలి