Moviesఆ డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మేస్తున్న చరణ్ .. నో డౌట్...

ఆ డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మేస్తున్న చరణ్ .. నో డౌట్ ..నిండా మునిగిపోవడం పక్కా..రాసిపెట్టుకోండి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ తన కెరియర్ని తానే నాశనం చేసుకుంటున్నాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన పేరు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ చెందింది . ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమా అదే స్థాయిలో ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడ్డారు .

శంకర్ దర్శకత్వం కావడంతో మరింత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు . అయితే శంకర్ గేమ్ చేంజర్ సినిమా కన్నా వేరే సినిమాల పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని సినిమా స్టార్టింగ్ నుంచి అభిమానులు మండిపడుతూ వస్తున్నారు. సినిమాని అప్పుడెప్పుడో అనౌన్స్ చేశారు . అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేదు . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన పాట లీక్ అయిపోయింది.

ఇక ఇదే క్రమంలో దీపావళికి ఆ పాటని ర్లీజ్ చేస్తున్నామంటూ ప్రకటించిన మూవీ టీం కొద్దిసేపటి క్రితమే పాటను వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు . ఆడియో డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చాయని ప్రస్తుతానికి ఈ పాటను వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చారు . దీంతో రామ్ చరణ్ ఫాన్స్ శంకర్ పై మండిపడుతున్నారు. నీకు సినిమాలు తీయడం చేతకాకపోతే ఇంట్లో కూర్చో అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . అంతేకాదు రామ్ చరణ్ కి సైతం సజెషన్స్ ఇస్తున్నారు . నువ్వు శంకర్ ని ఎక్కువ నమ్ముకుంటే నిండా మునిగిపోతావ్ చూసుకో అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news