హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. జరా పటేల్ అనే బ్రిటిష్ ఇండియన్ అమ్మాయి శరీరానికి రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసి ఏఐ టెక్నాలజీ సాయంతో బయటకు వదిలిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది రష్మికను బాగా హర్ట్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. చివరికి కేంద్ర మంత్రులు సైతం రష్మికకు అండగా నిలిచారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ తమిళ, కన్నడ సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా రష్మిక కి సపోర్ట్ చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే నటి మాధవీలత మాత్రం ఈ అంశంపై కాస్త డిఫరెంట్ గా స్పందించింది. రష్మిక సినిమాల్లో పలు ఈవెంట్స్ లో ధరించే డ్రెస్సులు కంటే అది అంత అసహ్యంగా.. వల్గర్‌గా ఏమీ లేదని చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తుంది. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రష్మిక డీప్ పేక్ వీడియోపై స్పందించింది. రష్మిక ఫోటోని వేరే అమ్మాయి బాడీకి అటాచ్ చేయడం జరిగింది. అందులో పెద్ద వల్గర్‌గా లేదు. కానీ రష్మిక సినిమాల్లో వేసుకున్నే డ్రెస్సులు కంటే తన చూపించే బూ… షో కంటే ఆ వీడియోలో పెద్దగా ఏమీ లేదని షాకింగ్ కామెంట్ చేసింది.
బాడీ మాత్రమే డిఫరెన్స్.. కాకపోతే స్టార్ హీరోయిన్లు ఎప్పుడైతే ఒక అంశం లేవనెత్తారో అది పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతుందని మాధవీలతో తెలిపింది. మాధవీలత అక్కడితో ఆగలేదు. జర్నలిస్టు అసోసియేషన్ కూడా రష్మికతో తాము ఉన్నామని ప్రకటించిన న్యూస్ చూశాను. అది నాకు చాలా కామెడీగా అనిపించింది. మై డియర్ జర్నలిస్టులు మీరు రష్మిక మందన్నతో ఉండటం కాదు.. బయట ఉన్న ఆడవాళ్ళ సేఫ్టీకి మీరు సహకారం అందిస్తే చాలా బాగుంటుంది. సొసైటీలో ఉన్న అమ్మాయిలకు అవేర్నెస్ ప్రోగ్రాములు అందిస్తే మీ జర్నలిజానికి ఒక విలువ ఉంటుందని సలహా ఇచ్చింది.
మొత్తం బట్టలన్నీ విప్పేసి హీరోయిన్గా నటించేసి.. అప్పటి సావిత్రి ఇప్పుడు సాయి పల్లవి, మాధవీలత మాదిరిగా మడిగట్టుకుని కూర్చునే హీరోయిన్‌లు కాదు వాళ్ళు. కాకపోతే ఒక సమస్యను లేవనెత్తడం అనేది మంచి విషయం. నేను దాని గురించే మాట్లాడాను అని తెలిపింది. రష్మిక ఒరిజినల్ గా వేసుకుని డ్రెస్సులు కంటే ఆ అమ్మాయి పెద్దగా అభ్యంతరమైన డ్రెస్ వేసుకోలేదు. పైగా అది స్విమ్ షూట్.. అలాగే ఉంటాయి. కాకపోతే సైజు మ్యాటర్ తప్ప అంతకుమించి ఏం లేదు. జర్నలిస్టులు ఫలానా హీరోయిన్ కు సపోర్ట్ అని కాకుండా బయట ఉన్న సమాజానికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని మాధవీలత చెప్పుకొచ్చింది.