టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు కుర్ర హీరోలు వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్న ఒకప్పటి హీరోలు అంటే జనాలకు చాలా చాలా ఇష్టం. వాళ్ళు నటించింది కొన్ని సినిమాల్లోనే అయినప్పటికీ జనాల మనసుల్లో మాత్రం పాతుకు పోయుంటారు. అలాంటి నటులలో ఒకరే సాయికిరణ్ . సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన సాయికిరణ్ “నువ్వే కావలి” సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత “ప్రేమించు” సినిమాతో మంచి విజయాన్ని అందుకొని క్రేజ్ సంపాదించుకున్నాడు . ప్రెసెంట్ సాయికిరణ్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయికిరణ్ కు లయతో ప్రేమాయణం పై ప్రశ్నలు ఎదురయ్యాయి . ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాలుగా అభిమానుల మనసుల్లో పాతుకుపోయిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేశాడు సాయికిరణ్ .
“అందరూ అనుకున్నట్టు లయకు నాకు మధ్య ప్రేమ దోమ లాంటివి ఏమీ లేవు.. మేం మంచి ఫ్రెండ్స్.. మా జంట చూడడానికి బాగుంటుంది అని ..మా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు .. పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుంది అని వాళ్లే ప్రపోజల్ తీసుకొచ్చారు . అయితే మా ఫ్యామిలీ వాళ్ళు జాతకాలు బాగా నమ్ముతారు .. కానీ అప్పట్లో మా జాతకాలు కలవలేదు.. అంతే ఎప్పుడైతే మా జాతకాలు కలవలేదు అని అనుకున్నామో.. మేం పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిపోయాం .. మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం.. ఆ తర్వాత ఇంద్రజిత్తు అనే షో కూడా చేసాం .. తమ్మారెడ్డి భరద్వాజ ఎంతో బాగుంది సినిమాలో కూడా నటించాం . అంతేకానీ మా మధ్య ప్రేమ దోమ లాంటివి ఏమీ లేవు ..ఇప్పుడు ఇద్దరం పరసనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చారు . ప్రస్తుతం సాయికిరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!