మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటలీలో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . హైదరాబాద్లో ఆదివారం నాడు ఘనంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సినీ రాజకీయ ప్రముఖులతో పాటు బుల్లితెర నటులు కూడా.. ఈ రిసెప్షన్ కి హాజరయ్యారు . అంతేకాదు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ జంట చూడ చక్కగా ఉంది అంటూ అందరూ తెగ పోగడేసారు .
చాలా సింపుల్గా చాలా ట్రెడిషనల్ గా కూల్ గా చాలా సక్సెస్ఫుల్గా రిసెప్షన్ కంప్లీట్ అయింది . కాగా రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి . ఇలాంటి మూమెంట్ లోనే లావణ్య రిసెప్షన్లో వెంకటేష్ అన్న మాటలకు హార్ట్ అయింది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వెంకటేష్ దగ్గుబాటి .. లావణ్య త్రిపాఠి – వరుణ్ రిసెప్షన్ కి హాజరయ్యారు . ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎఫ్ త్రీ అనే సినిమాలో కలిసి నటించారు.
ఈ సినిమాలో పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం నాకు బాగా తెలుసు అనే డైలాగ్ బాగా పాపులారిటీ అయింది . అయితే స్టేజ్ పై ఇదే డైలాగ్ ను గుర్తు చేశాడట. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయిపోయిన లావణ్య పక్కకు వెళ్ళిపోతూ ఉండగా .. లావణ్య ని వరుణ్ ఆపుతాడు. దీనికి సంబంధించిన పిక్చర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సరదాగా అన్న మాటలను కూడా సీరియస్ గా తీసుకోవాలా లావణ్య ..? అంటుంటే సినిమా ఇండస్ట్రీలో ఇవి కామన్ అలాంటివి పట్టించుకోకూడదు అంటూ కొందరు చెప్తున్నారు..!