Moviesఆ ఒక్క విషయంలో మాత్రం ఈ ముగ్గురు ఎప్పటికి ఒక్కటే..తగ్గేదేలే..!!

ఆ ఒక్క విషయంలో మాత్రం ఈ ముగ్గురు ఎప్పటికి ఒక్కటే..తగ్గేదేలే..!!

ప్రజెంట్ సొసైటీలో భర్తతో పాటు భార్య కూడా జాబ్ చేయడం.. భర్తతో పాటు సరి సమానంగా సంపాదించడం మనం కామన్ గా చూస్తున్నాం . కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకొని ఒక్కొక్కరు సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోల భార్యలు కూడా పలు బిజినెస్ లు చేస్తూ వాళ్లకు మించిన ఆదాయాన్ని అందుకుంటున్నారు . అలాంటివారు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

నమ్రత శిరోద్కర్ : సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత స్టార్ హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే . పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి మహేష్ బాబు బిజినెస్ లని ఆమె చూసుకుంటుంది . ఏ ఎం బి మాల్ తో పాటు టెక్స్టైల్, ఫుడ్ బిజినెస్లలో మహేష్ బాబు పెట్టుబడులను ఆమె దగ్గరుంటే చూసుకుంటుంది . ఈ విధంగా నమ్రత కోట్లలోనే టర్న్ ఓవర్ వస్తుంది .

ఉపాసన: దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ లో ఒకటైన అపోలో హాస్పిటల్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉంటున్న ఉపాసన ఎయిర్లైన్స్ బిజినెస్ , యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్ వెబ్సైట్ బాధితులు నిర్వహిస్తుంది . అంతేకాదు ఓపక్క మెగా ఇంటి కోడలుగా మరోపక్క బిజినెస్ ఉమెన్ గా ఉపాసన బిజీ బిజీగా ముందుకెళ్తుంది . ఉపాసన టర్న్ ఓవర్ కూడా కోట్లలోనే ఉంటుంది .

స్నేహ రెడ్డి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి చాలా తక్కువ మందికే తెలుసు . సోషల్ మీడియాలో అందాలను ఎక్స్పోజ్ చేస్తుందని మాత్రమే అనుకుంటారు . కానీ ఆమె రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అని చాలామందికి తెలియదు . స్నేహారెడ్డి నాన్న స్థాపించిన సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి డైరెక్టర్గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఓ ఫోటో స్టూడియో ని కూడా ఆమె తన సొంత డబ్బులతో నడిపిస్తుంది . అంతేనా అల్లు అర్జున్ కి మించిపోయిన రేంజ్ లో ఆమె ఇయర్లీ టర్న్ ఓవర్ కూడా ఉంటుంది . ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాలలో తమ భర్తలకు కాంపిటీషన్ ఇచ్చేలా మరికొందరు తమ భర్తలనే మించిపోయేలా ఆదాయం సంపాదించుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news