సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అని తెలుసుకోవడం .. మహా మహా కష్టమైపోతుంది ట్రోలర్స్ మీమర్స్ తమకు నచ్చిన సెలబ్రిటీస్ కి సంబంధించిన పాజిటివ్ వార్తలను ట్రెండ్ చేస్తున్నారు ఎవరైతే సెలబ్రిటీస్ తమకు నచ్చరో ..వాళ్ళపై నెగటివ్‌గా వార్తలు క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో హీరో శివాజీ పేరు ఎలా మారు మ్రోగిపోతుందో మనం చూసాం . పలు సినిమాల్లో నటించి క్రేజీ స్థానాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు . రాజకీయాలలో పలు సంచలన వ్యాఖ్యలు చేసి జనాలు చేత బూతులు తిట్టించుకున్నాడు.
అయితే రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి అడుగుపెట్టడంతో ఈయనకు సంబంధించిన వార్తలను మరోసారి వైరల్ చేస్తున్నారు జనాలు . బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శివాజీ అంటే పడని కొందరు ఆకతాయిలు ఆయనపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడానికి ఆయన కెరియర్ను దెబ్బ కొట్టడానికి తన సొంత చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు అన్న వార్తను ట్రెండ్ చేస్తున్నారు. శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆయనకు వరుసకు చెల్లెలు అవుతుందని ఆయనకు దూరపు బంధువు అని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు.
శివాజీ టాప్ కంటెస్టెంట్ కావడంతో ఈ వార్తలు జెట్ స్పీడ్ లో వైరల్ అయ్యాయి. అయితే వెంటనే అలర్ట్ అయిన శివాజీ అభిమానులు అది మొత్తం ఫేక్ అని అస్సలు నమ్మొద్దు అని అసలు శివాజీ భార్య తనకు బంధువే కాదని.. శివాజీది వేరే క్యాస్ట్ తన భార్యది వేరే క్యాస్ట్ అని చెప్పుకొస్తున్నారు. శివాజీది ఏపీలోని గుంటూరు జిల్లా అని.. శివాజీ భార్య శ్వేతది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా అని వాళ్ళిద్దరికీ అసలు ఏ సంబంధం లేదు అని.. వాళ్ళు వరుసకు అన్నా చెల్లెలు అవ్వరు అని కావాలనే కొందరు ఇలా పుకార్లు సృష్టించి ఆయన పరువు తీస్తున్నారని శివాజీ చాలా మంచి వ్యక్తి అని .. ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండానే ఆమెను వివాహం చేసుకొని లైఫ్ ఇచ్చాడు అని.. స్టార్ సెలబ్రెటీ అయినా సామాన్యుల జీవించడం ఆయనను చూసే నేర్చుకోవాలి అని.. ఎవరైతే శివాజీపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారో వారి వారికి ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే కావాలనే కొందరు ఇలా శివాజీ పై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు అంటూ జనాలు సైతం మండిపడుతున్నారు..!!