ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జగపతిబాబు తనకు కొడుకులు లేరు అని బయట నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోవాలని అనుకున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . స్వయాన ఈ విషయంపై జగపతిబాబునే స్పందించారు .
జగపతిబాబుకు ఇద్దరు కూతుర్లే . అంతేకాదు వాళ్ళ బ్రదర్స్ కి కూడా ఎవరు కొడుకులు లేరు . ఈ క్రమంలోనే జగపతిబాబు నాన్నగారు వారసులు లేరే అంటూ తెగ బాధపడిపోయారట , అయితే జగపతిబాబు తన బ్రదర్ మాత్రం కూతుర్లు కొడుకులు ఒకరే అన్న ఫీలింగ్ లో ఉన్నారు . అయితే తన తండ్రి బాధను చూడలేక కనీసం బయట నుంచి ఎవరైనా అనాధ పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుకుందామా..? అంటూ కూడా తన తండ్రిని అడిగారట .
తన తండ్రిపై జగపతిబాబుకు అంత ప్రేమ అ. యితే జగపతిబాబు మాత్రం ఎప్పుడూ కూడా ఆడ .. మగా అని తేడాగా చూడలేదు. ఇద్దరు కూతుర్లని సమానంగా పెంచారు . అంతేకాదు వాళ్ళని ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎందుకు రానివ్వలేదు అని యాంకర్ ప్రశ్నించగా.. అసలు వాళ్లకు సినీ ఇండస్ట్రీ అంటేనే ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు మరి వాళ్ళకి ఇష్టం లేని పనులు నేను ఎలా చేయగలను అంటూ క్లారిటీగా బదులిచ్చారు జగపతిబాబు..!!