ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ లావణ్య త్రిపాటికి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా ఆమె ఎప్పుడైతే మెగా కోడలు కాబోతుంది అని తెలిసిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమె గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆరాట పడిపోతున్నారు . గూగుల్లో లావణ్య ఏజ్ ఎంత..? లావణ్య ఏం చదువుకుంది ..? లావణ్య ఏ కంట్రీ కి సంబంధించింది ..? లావణ్య ఫేవరెట్ కలర్ ఏంటి..? ఫుడ్ ఏంటి ..? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు . అయితే రీసెంట్ గా అసలు లావణ్య ఆస్తి డీటెయిల్స్ ఎంత అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు .
ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు . కత్తిలాంటి ఫిగర్లు ఉన్నారు . మరి ఎందుకు వరుణ్ తేజ్ వెళ్లి వెళ్లి నార్త్ ఇండియా అమ్మాయిని చూస్ చేసుకున్నాడు. లావణ్య వరుణ్ కంటే హైట్ లో చాలా పొట్టి .అయినా కూడా ఎందుకు ఆమెని తన భార్యగా చూస్ చేసుకున్నాడు..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే మెగా బ్రదర్ నాగబాబు ఆస్తుల కన్నా వరుణ్ ప్రేమించిన లావణ్య త్రిపాఠి తల్లిదండ్రుల ఆస్తి చాలా ఎక్కువ అని ..పైగా లావణ్య త్రిపాఠి కుటుంబం చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ అని ఆ కట్టుబాట్లకే వరుణ్ అట్రాక్ట్ అయిపోయాడు అంటూ తెలుస్తుంది .
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీ లోకి వచ్చి సంపాదించింది కేవలం 35 కోట్లు మాత్రమే… కానీ ఆమెకు తన పూర్వికులు ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తి మాత్రం వందల కోట్లలోనే ఉంటుంది. ఇది కేవలం లావణ్య త్రిపాఠి వంతు మాత్రమే ..తన బ్రదర్ సిస్టర్ కి ఇవ్వగా తనకొచ్చిన షేర్ మాత్రమే ..ఇన్ని వందల కోట్లు. అందుకే వరుణ్ తేజ్ ముందు చూపుతోనే లావణ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంటూ కొందరు ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి – పవన్ కళ్యాణ్ కు కోట్ల ఆస్తి ఉన్న నాగబాబుకు మాత్రం అంత లేదు కొన్ని సినిమాలలో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఉన్నదంతా పోగొట్టుకునేసాడు . ఇప్పుడు వరుణ్ సంపాదించింది నాగబాబు దాచిపడుతున్నాడు . అలా చూసుకుంటే వరుణ్ .. లావణ్య త్రిపాఠి కాళీ గోటికి కూడా సరిపోరు అంటూ కావాలని మెగా హేటర్స్ డి గ్రేడ్ చేస్తున్నారు..!!