స్నేహ..చూడగానే చక్కటి అందం..మంచి ఫిజిక్. ఎవరైనా కంప్లీట్ ఫ్యామిలీ హీరోయిన్ అనుకోక తప్పదు. చెప్పాలంటే అప్పట్లో సౌందర్య తర్వాత ఆ రేంజ్ ఫిగర్ ఉంది స్నేహ కే. మొదటి సినిమా తొలివలపు. ఈ సినిమా హిట్ సాధించలేదు. ఆ తర్వాత ప్రియమైన నీకు. తరుణ్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. డీసెంట్ పర్ఫార్మెన్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
వెంకటేశ్ లాంటి ఫ్యామిలీ హీరో కూడా తన సినిమాలో స్నేహ కావాలని అడిగి మరీ ఛాన్స్ వచ్చేలా చేశాడు. ఆ సినిమా సంక్రాంతి. ఇందులో కూడా స్నేహ ని చూస్తే మన ఇంట్లో అమ్మాయే కదా..అనిపిస్తుంది. ఆ సినిమాలో మేయిన్ గా స్నేహ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నారు.
అయితే, స్నేహ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది కాస్తా సో సోగా మిగిలిపోయింది. దీనికి కారణం మెగాస్టార్ లాంటి వారి పక్క మాస్ ఎంటర్టైనర్స్ లో నటించకపోవడమే. చాలామంది ఇంత డీసెంట్ క్యారెక్టర్స్ చేస్తే ఇండస్ట్రీలో తీసి పక్కన పెడతారని సలహాలిచారు. దాంతో వెంకీ లాంటి మాస్ కథ కి ఓకే చెప్పింది. ఈ సినిమాలో స్నేహని చూస్తే హవ్వా..అనాల్సిందే. ఇందులో స్నేహ అందాల ఆరబోత అందరినీ ఆకట్టుకుంది.
కొన్ని తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. వీటిలో కొన్ని గ్లామర్ రోల్స్ చేసింది స్నేహ. ఇంకా చెప్పాలంటే తడిసిన అందాలతో రెచ్చిపోయింది. మలయాళ సినిమాలంటే ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ డం కోసం వచ్చిన అవకాశాన్ని వద్దనకుండా చేసింది. తెలుగులో అందాలు ఆరబోయని స్నేహ మలయాళంలో మాత్రం వేడెక్కించింది. ఇప్పుడు వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ కొనసాగుతుంది.