Newsసితార హీరోయిన్ అయితే.. హీరో మాత్రం ఆ హీరో కొడుకే ఉండాలి..ఫ్యాన్స్...

సితార హీరోయిన్ అయితే.. హీరో మాత్రం ఆ హీరో కొడుకే ఉండాలి..ఫ్యాన్స్ కొత్త డిమాండ్ మామూలుగా లేదుగా..!!

ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ మరీ ఓవర్ చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న క్లిం కారాకు అల్లుఅయ్యాన్ కి పెళ్లి చేయాలి అంటూ కొందరు మెగా ఫాన్స్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అది వాళ్ళ పై ఉండే ప్రేమ కారణంగా లేకపోతే వాళ్లంటే అభిమానించే కారణంగా అన్న కూడా అది చాలా చాలా తప్పు . చిన్నవయసులోనే అలాంటి పెద్ద మాటలకు మనం వెళ్లకూడదు. అయితే రీసెంట్ గా అలాంటి మరికొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

త్వరలోనే ఇండస్ట్రీలోకి సితార ఘట్టమనేని హీరోయిన్గా రాబోతుంది అన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే . సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ సితారకి ఏది ఇష్టమైతే అదే చేయిస్తామని .. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే ఆమె ఇష్టాన్ని మేము గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఒకవేళ సితార ఘట్టమనేని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెడితే ఏ హీరో సరసన బాగుంటుంది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి .

అయితే నూటికి ఎనభై శాతం మంది సితార ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా తోనే ఎంట్రీ ఇవ్వాలి అని ..వీళ్ళిద్దరి కాంబో తెరపై అదిరిపోద్దని ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా ఈ జంట నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఫాన్స్ కి క్యూరియాసిటీ ఎక్కువగానే ఉన్న అది జరిగే పనులుగా తెలియడం లేదు . అకిరా సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడా ..? రాడా..? అన్నది ఇంకా 50 50 గానే ఉంది .

వచ్చినా కూడా సితార ఘట్టమనేని సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలి అనడం చాలా మూర్ఖత్వం . అది జరుగుతుందో లేదో కూడా తెలియదు . లుక్స్ పరంగా సితారా కి అకిరా లుక్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వవు అంటున్నారు కొంతమంది జనాలు. ఏమో సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం ..ఫాన్స్ కోరుకున్న ప్రకారం సితార – అకిరానందన్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందేమో ..కాలమే దానికి సమాధానం చెబుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news