సినిమా రంగంలో అనేక మంది రచయితలు ఉన్నారు. ఎంతో మంది లబ్ధ ప్రతిష్టులైన వారు సినీ రంగానికి సేవలు అందించారు. రచయితలు చలం సహా శ్రీశ్రీ నుంచి తిరుపతి వెంకట కవుల వరకు ఎంతోమంది తెలుగు సినీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. మాట విరుపులతో ఒకరు తమ కలాన్ని ఝుళిపిస్తే.. నర్మగర్భ వ్యాఖ్యలతో పదాలను కూర్చి.. వెండితెరను మాటల పూదోటగా మార్చిన వారు కూడా ఉన్నారు.
అయితే.. వీరందరూ కూడా కేవలం మాటలకే పరిమితం అయ్యారు. తర్వాత.. వచ్చిన దాసరి నారాయణ రావు.. తన సినిమాలకు తానే కథ, మాటలు రాసుకున్నారు. అయితే.. వీరికన్నా ముందుగానే సినీ రంగంలోకి వచ్చిన దర్శకుడు జంధ్యాల తొలుత అసిస్టెంట్ దర్శకుడిగా చేరారు. అనంతరం.. కళాతపస్వి కే. విశ్వనాథ్ దగ్గర పనిచేశారు. ఆయన సూచనలతో మాటల రచయితగా మారారు.
విశ్వనాథ్ తీసిన అనేక సినిమాలకు జంధ్యాల మాటలు ఇచ్చారు. శంకరాభరణం, సప్తపది వంటి సినిమాల్లో మాటల రచయితగా ఆయన పేరు జగద్విఖ్యాతి పొందింది. తెలుగు మాటకు, అక్షరానికి ఎనలేని గౌరవం తీసుకువచ్చారు. సందర్భం ఎలాంటి దైనా.. మాటల పొందిక.. తప్పేది కాదు. వ్యంగ్యమైనా.. శృంగారమైనా.. రౌద్రమైనా ఆచి తూచి మాటలు పండించారు. సప్తపది సినిమాలో హీరోయిన్‌కు ఆయన రాసిన మాటలు కేవలం 10. ఇదే విషయాన్ని దర్శకుడు విశ్వనాథ్ చెప్పుకొని ఆశ్చర్యపోయారు.
కానీ, దూరదృష్టి, నిశిత గమనిక.. జంధ్యాల పాటించేవారు. ప్రతి అక్షరానికీ ఆయన పట్టాభిషేకం చేసినట్టు గా భావించేవారు. ఆచితూచి తూకం వేసినట్టు రాసేవారు. తప్ప.. ఎక్కడా ఒక్క అక్షరాన్ని కూడా ఆయన వృధా చేసేవారు కాదు. తర్వాత.. తర్వాత.. తన సినిమాలకు వంశీని మాటల రచయితగా పెట్టుకోవడం గమనార్హం.