Newsఆయ‌న మాట విన‌క‌పోయి ఉంటే ' బొమ్మ‌రిల్లు ' సినిమా పెద్ద...

ఆయ‌న మాట విన‌క‌పోయి ఉంటే ‘ బొమ్మ‌రిల్లు ‘ సినిమా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యేదా…!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు. సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, తణికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సినిమా రిలీజ్ కి ముందే దేవీశ్రీ మ్యూజిక్ తో సగం హిట్టైంది.

బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యాక అన్నీ వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నువ్వే కావాలి, చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వే నువ్వే, ఖుషి, జయం చిత్రాలతో పోల్చుకుంటే బొమ్మరిల్లు సినిమా చాలా ప్రత్యేకం. ఇందులో ఉన్న టిపికల్ సీన్స్ మరే సినిమాలోనూ కనిపించవు. అన్నీ వయసు ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం చాలా కష్టం.

ఈ విషయంలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి మొత్తం క్రెడిట్ ఇచ్చేయాల్సిందే. అంత సెన్సిటివ్‌గా ఢీల్ చేశాడు. సినిమాలో ఉన్న ప్రతీ క్యారెక్టర్ కి ఓ జడ్జ్‌మెంట్ ఇచ్చాడు. అయితే, ఆఫ్స్క్రీన్ లో జరిగిన పెద్ద చర్చ మాత్రం ఈ సినిమాకి ప్రధాన కారణమని ఎవరికీ తెలీదు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ మొత్తం అయ్యాక ఎడిటింగ్ జరుగుతోంది. ఎడిటర్ క్లైమాక్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేకపోతున్నాడు.

ఎన్నిసార్లు చూసిన సంథింగ్ మిస్సింగ్ అని బలంగా నమ్ముతున్నాడు. అదే విషయం చెప్పి..ప్రకాశ్ రాజ్, సిద్దార్థ్ ల మధ్య జరిగే ఎమోషనల్ సీన్ లో సిద్దార్థ్ ఎమోషన్స్ మిస్సయ్యాయని ..మళ్ళీ షూట్ పెట్టి ఆ ఎమోషన్స్ అన్నీ షూట్ చేయాల్సిందే..లేదంటే సినిమా ఫ్లాపవుతుంది..అని నిర్మాత దిల్ రాజుకి, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి చెప్పాడట. దాంతో మళ్ళీ షూటింగ్ చేసి మిస్సైన ఎమోషన్స్ అన్నీ షూట్ చేయడం జరిగిందట. ఎడిటర్ గనక నాకెందుకులే అనుకుంటే బొమ్మరిల్లు సినిమా గురించి ఇంత మాట్లాడుకునేవాళ్ళం కాదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news