టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వేణు స్వామి చెప్పినట్టు జాతకం ఏమాత్రం బాగున్నట్టు లేదు. బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ప్రభాస్‌కు అస్సలు కాలం కలిసి రావడం లేదు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా అంటూ సాహూ సినిమా చేసినా.. సాహూ అంచనాలు అందుకోలేదు. సాహో బాలీవుడ్ లో ఆడకపోయి ఉంటే నిర్మాతలు నిండా మునిగిపోయే వాళ్ళు. రాదేశ్యామ్‌పై ఎంత హడావుడి చేసిన బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కొన్న వాళ్ళు అంతా నిండా మునిగిపోయారు. సినిమా విషయంలో ముందు నుంచి రకరకాల సందేహాలు విమర్శలు వచ్చాయి. టీజర్ వచ్చాక ఈ విమర్శలు మరింత పెరిగాయి.
తర్వాత అనేక రిపేర్లు చేసి సినిమాను వదిలితే సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఇక ఇప్పుడు అభిమానులు ఆశలన్నీ సలార్ మీదే ఉన్నాయి. సలార్ టీజర్ బయటికి వచ్చింది. అయినా ఎవరికి నమ్మకాలు కుదరలేదు. ముందుగా సెప్టెంబర్ 28 రిలీజ్ అన్నారు. ఇప్పుడు డిసెంబర్ 22 అంటున్నారు. అయితే సినిమా మేకింగ్ క్వాలిటీ విషయంలో లెక్క లేన్నని సందేహాలు వస్తున్నాయి. సలార్ భారీ బడ్జెట్ బిజినెస్ నేపథ్యంలో రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే ఇప్పుడు తొలి పార్ట్ అనుకున్నట్టుగా రాకపోవడంతో రెండో పార్ట్‌ల సీన్లు కొన్ని ఫస్ట్ పార్ట్‌లో కలిపేసి ఒక భాగంగానే విడుదల చేయాలని డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
దీనికి తోడు సలార్ విషయంలో అనుకున్న స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగటం లేదు. సినిమా మీద నమ్మకం ఉంటే హంభాలే ఫిలిమ్స్ వాళ్లు డైరెక్ట్ గానే కమిషన్ పద్ధతి మీద రిలీజ్ చేసుకుంటారు. అయితే సలార్ విషయంలో నాన్ రికవరబుల్ అడ్వాన్స్ మీద సినిమాను అమ్మేసుకోవాలని చూస్తున్నారు. అంటే సినిమా మీద అంత నమ్మకం ఉంటే ఇలా సినిమాను ఎందుకు వదిలించుకోవాలని అనుకుంటున్నారు అన్న సందేహాలు కూడా సహజంగానే వస్తుంటాయి. ఇక సినిమా మొత్తం మీద అమ్మ పాట ఒకటే ఉంటుందని ముందుగా చెప్పారు. అయితే ఇప్పుడు ఐటెం సాంగ్ కూడా యాడ్ చేశారట. సలార్ హిట్టయితే ప్రభాస్‌కి అన్ని విధాల బాగుంటుంది. తేడా కొడితే ఇక భారం అంతా ప్రాజెక్టు కే మీద వేసి దేవుడు వైపు చూడటం తప్ప చేసేదేం లేదు.