అగ్రదర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ తీసిన అనేక అపురూప చిత్రాల్లో సప్తపది ఒకటి. ఈ సినిమాలో కులహంకారంపై ఆయన పోరు సల్పారనే చెప్పాలి. ఓ నిమ్నజాతి వర్గానికి చెందిన యువకుడిని అగ్రవర్ణ యువతి ప్రేమించడంతో ప్రారంభమయ్యే సినిమాను చివరకు.. అగ్రవర్ణం రియలైజ్ అయి.. ఆ యువకు డికి ఆ అమ్మాయితో వివాహాన్ని అంగీకరించడమే ఈ సినిమా సారాంశం. నిజానికి ఇప్పుడున్న మీడియా అప్పట్లో లేదు.
ఇప్పుడున్న సామాజిక చైతన్యం కూడా అప్పట్లో లేదు. పైగా అప్పటికి ఇంకా బ్రాహ్మణ కట్టుబాట్లు… సహా.. ఇతర సామాజికవర్గాల్లో కులాంతర, మతాంతర వివాహాల విషయంలో కొన్ని కట్టుబాట్లు కొనసాగుతున్నా యి. ఇలాంటి సమయంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అగ్రదర్శకుడు కే. విశ్వనాథ్ ఈ ప్రయో గం చేయడం సంచలనమనే చెప్పాలి. అయినా.. ఆయన ఎక్కడా వెనుకాడలేదు. సినిమా వచ్చేసింది. దీనికి పెద్దగా బడ్జెట్ పెట్టలేదు.
ఎందుకంటే.. అంతా కులాల చుట్టూ.. పట్టింపులు.. ఆచారాల చుట్టూ తిరుగుతుంది. పైగా.. శాస్త్రీయ సంగీతంతో మేళవించిన సినిమా. పెద్దగా అంచనాలు కూడా లేవు. ఇక, విశ్వనాథ్ కూడా ఇదే చివరి సినిమా అని ప్రకటించేయాలని అనుకున్నారు. ఇదిలావుంటే.. సినిమా హిట్టయింది. తండోపతండాలుగా ప్రేక్షకులు వచ్చారు. కానీ, ఈ సినిమా పై బ్రాహ్మణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
విశ్వనాథ్ దిష్టి బొమ్మను రాజమండ్రి దేవీ చౌక్, లింగాల ఘాట్‌లలో తగల బెట్టారు. కొందరు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కొన్ని రోజుల పాటు విశ్వనాథ్ ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. కానీ, ఈ సమయంలో సామాజిక పెద్దలు.. మేధావులు విశ్వనాథ్‌కు అండగా నిలిచారు. ఇక అప్పటి నుంచి ఆయన ఈ విషయంలో ముందుకు పోలేదు. కులాలకు అతీతంగా వ్యక్తిగత సమస్యలపై సినిమాలు తీశారు. ఇలా వచ్చినవే.. స్వాతిముత్యం, స్వాతి కిరణం, స్వాతి చినుకులు వంటివి.