సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోల పారితోషికాల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలోకి వస్తుంటాయి. అయితే వైరల్ అయిన లెక్కల్లో అసలు నిజానిజాలు మాత్రం ఆయా సినిమాల దర్శకనిర్మాతలకు తప్ప ఎవరికీ తెలియవు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న తారక్ నాన్నకు ప్రేమతో సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల 33 లక్షల రూపాయలు మాత్రమే పారితోషికంగా అందుకున్నారు.
నాన్నకు ప్రేమతో రిలీజ్ తర్వాత పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో అప్పట్లో తారక్ స్పందించి తన రెమ్యునరేషన్ గురించి వెల్లడించడం జరిగింది. నాన్నకు ప్రేమతో మూవీ కమర్షియల్ గా హిట్ గా నిలవడంతో పాటు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు తక్కువ పారితోషికం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది.
నాన్నకు ప్రేమతో సినిమాకు బీ.వీ.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత కాగా ఎన్టీఆర్ బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ కాంబోలో తెరకెక్కిన ఊసరవెల్లి మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. నాన్నకు ప్రేమతో మూవీకి తక్కువ పారితోషికం తీసుకోవడం ద్వారా తారక్ ఆ నష్టాలను భర్తీ చేశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. నిర్మాతల శ్రేయస్సు కోరే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతల్లో సదభిప్రాయం ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. బిజినెస్ పూర్తైన తర్వాత లాభాల్లో వాటా తీసుకునే విధంగా తారక్ కు ఒప్పందం కుదిరిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా రిలీజ్ కు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. 120 రోజుల్లో తారక్ సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.