అక్కినేని హీరో నాగచైతన్య నటించిన దూత సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సిరీస్ కోసం నాగచైతన్య చాలా జోరుగా ప్రచారం చేస్తున్నాడు. దూతలో నటించడానికి.. ఇలా ప్రచారం చేయడానికి చైతు గట్టిగానే ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే దూత కోసం చైతు తన కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చైతు ఒక్కో సినిమా చేసినందుకు కాస్త అటు ఇటుగా రూ.9 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు.
బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దాలో నటించినందుకు అతడికి ఇచ్చిన పారితోషకం రూ.8 కోట్లు.. అంటే చైతు రూ. 8 – 9 కోట్ల మధ్యలో పారితోషం తీసుకుంటున్నాడు. చైతు మార్కెట్ కూడా అంత గొప్పగా లేదు. దీంతో అతడికి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా రీజనబుల్ అని చెప్పాలి. దూత వెబ్ సిరీస్ కోసం మాత్రం చైతు ఏకంగా రూ.12 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడితో అయిపోలేదు. దూత సిరీస్‌కు తాజాగా సీజన్ 2 కూడా ప్రకటించారు దర్శకుడు విక్రమ్ కుమార్. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయి.
ఆ రెమ్యూనరేషన్ కూడా కలుపుకుంటే తన తొలి ఓటీటీ సినిమా ద్వారా నాగచైతన్య ఏకంగా రూ.24 కోట్ల రూపాయలు అర్జించినట్లు అయింది. నాగచైతన్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ నెంబర్. ఓ ప్లాప్ హీరో నాగచైతన్యకు రూ.24 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక దూత ప్రచారం ముగిసిన వెంటనే చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతాడు చైతు. ఆ సినిమా కోసం ఏకంగా మూడు నెలల పాటు షెడ్యూల్స్ ప్లాన్ చేశారు.