ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటోలే వైరల్ అవుతున్నాయి . వీళ్ళ పెళ్లి నవంబర్ ఒకటవ తేదీ చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . మెగా ఫ్యామిలీ , దగ్గర స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి అయ్యారు . మూడు రోజులపాటు ఇటలీలో ఘనంగా వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేశాడు .
ఆమెను భార్యగా అఫీషియల్ గా ప్రకటించారు . ఇటలీలో అత్యంత పురాతన గ్రామం టస్కన్యాలోకి బోరగాస్ అండ్ ఫెలోస్ రిసార్ట్లో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది . పెళ్లి చీరలో చాలా కుందనపు బొమ్మగా మెరిసింది లావణ్య. ఆమె కట్టుకున్న ఈ చీర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ చీర పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది . ఆమె ఎరుపు రంగులో గోల్డ్ కలర్ బార్డర్ కాంచీపురం చీరని ప్రత్యేకంగా తయారు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
ఈ చీర ఖరీదు దాదాపు 15 లక్షల పైగానే ఉంటుందట . అయితే దీనిని డిజైన్ చేసింది మరెవరో కాదు ప్రముఖ వెడ్డింగ్ డిజైనర్ గా పేరు సంపాదించుకున్న మనీష్ మిల్హోత్రా . చాలా ప్యూర్ కంచి పట్టుచీరగా తెలుస్తుంది . అంతేకాదు లావణ్య త్రిపాఠి ఈ పట్టుచీరలో కుందనపు బొమ్మల మెరిసిపోతుంది అని .. వరుణ్ చాలా చాలా లక్కీ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి..!!