Newsపెళ్లై పిల్ల‌లున్న ఆ డైరెక్ట‌ర్‌తో ప్రేమ‌.. ఈ స్టార్ లేడీ సింగ‌ర్...

పెళ్లై పిల్ల‌లున్న ఆ డైరెక్ట‌ర్‌తో ప్రేమ‌.. ఈ స్టార్ లేడీ సింగ‌ర్ కెరీర్ నాశ‌నం…!

`నువ్వ‌డిగింది.. ఏనాడైనా కాద‌న్నానా ? నువ్వుర‌మ్మంటే ఎక్క‌డికైనా రాన‌న్నా- ఈ పాట ఒక‌ప్ప‌డు తెలుగు ప్ర‌జ‌ల‌ను ఓ ఊపు ఊపేసింది. ఇదే కాదు..లే..లే..లే నా రాజా.. లేవ‌నంటావా..? న‌న్ను లేప‌మంటావా?“ అన్న ఈ పాట కూడా ప్రేక్ష‌కుల గుండెల్లో గిలిగింత‌లు రేపింది… ఇలాంటి అనేక పాటలు పాడిన ప్ర‌ముఖ గాయ‌కురాలు.. ఎల్‌.ఆర్‌. ఈశ్వ‌రి. ఈమె వాస్త‌వానికి త‌మిళియ‌న్‌. అయితే.. అగ్ర‌ద‌ర్శ‌కుడు బాల‌చంద‌ర్ ప్రోత్సాహంతో ఆమె తెలుగులోనూ అనేక పాట‌లు పాడారు.

ఏ పాట‌లో అయినా.. లీనం కావ‌డం, పాట‌ను హైలెట్ చేయ‌డం ఎల్ ఆర్‌. ఈశ్వ‌రిని టాప్ పొజిష‌న్‌లో నిలి పింది. అయితే.. ఆమె జీవితం కూడా.. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎవ‌రినైతే ఆమె న‌మ్మిందో ఆయ‌నే ఆమెకు హ్యాండిచ్చాడు. దీంతో జీవితాంతం ఆ జ్ఞాప‌కాల్లోనే ఆమె ఉండిపోయారు. 18 ఏళ్ల వ‌య‌సులోనే సినీ గాయ‌కురాలిగా అరంగేట్రం చేసిన ఈశ్వ‌రి.. త‌మిళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అన‌ద‌గ్గ వేల పాట‌ల‌కు గాత్రం అందించారు.

ఈశ్వ‌రికి తొలినాళ్ల‌లో ఓ అగ్ర ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం కావ‌డంతో అనేక సినిమాలు ఆమెకు క్యూక‌ట్టాయి. ఈ క్ర‌మంలోనే ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే, దీనిని ఆమె తిర‌స్క‌రించారు. త‌ర్వాత‌.. ఓ సినిమాలో క్యారెక్ట‌ర్ పాత్ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక‌, వ్య‌క్తిగ‌త జీవితాన్ని చూస్తే.. గాయ‌కురాలిగా ఆమె ఉన్న‌త‌స్థాయికి చేరుకునే స‌మ‌యంలో ఓ డైరెక్ట‌ర్‌తో ఆమె ప్రేమ‌లో ప‌డ్డారు. ఆయ‌న‌ను న‌మ్మారు. ఏకాంతంగా కూడా గ‌డిపార‌ని త‌మిళ మీడియా అనేక సంద‌ర్భాల్లో రాసుకొచ్చింది.

అప్ప‌టికే పెళ్ల‌యి.. ఇద్ద‌రు పిల్లలున్న ఆ డైరెక్ట‌ర్ చివ‌ర‌కు.. ఈశ్వ‌రిని వ‌దిలించుకోవ‌డంతో ఆమె డిప్రెష న్‌లోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలకుపైగానే సినీ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో స‌న్యాసం తీసుకునేందుకు రెడీ అయ్యార‌ట‌. చివ‌ర‌కు అతిక‌ష్టం మీద త‌న‌ను తాను నిల‌దొక్కుకు న్నారు. సినీ ఫీల్డ్ ఆక‌ర్ష‌ణ‌ల మాయాజాలం. కొత్త‌గా ఈ ఫీల్డ్‌లోకి వ‌చ్చేవారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని ప‌దేప‌దే ఆమె చెబుతారంటే.. జీవితానుభ‌వ‌మే క‌దా..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news