హీరోయిన్ ని లేపాలన్నా ఫాంలో ఉన్నప్పుడు తొక్కిపడేయాలన్నా ఈ ముగ్గురు వల్లే అవుతుంది. వాళ్ళే దర్శకుడు, నిర్మాత, హీరో. ఒక హీరోయిన్ వీరు చెపింది చేయకపోతే మళ్ళీ అవకాశం అనేదే ఉండదు. ఇక ఒక సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అవ్వాలంటే దర్శకుడు చెప్పని అబద్ధం ఉండదు. నిన్ను స్టార్ హీరోయిన్ ని చేసేది నేనే అంటాడు. నిర్మాత నా బాగా క్లోజ్ నువ్వు నేను చెప్పింది వింటే రేపటి స్టార్ హీరోయిన్ నువ్వే అంటాడు.
ఆడిషన్స్ సమయంలో హీరోయిన్ గా వచ్చిన అమ్మాయి ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుంది. ఆ అమ్మాయి చెప్పిన పని చేస్తుందా లేదా..మొడి ఘటం అయితే అటు నుంచి అటే ఎలా పంపాలి..వెంటనే ఒప్పుకునే అమ్మాయిని ఎలా చూడాలి. కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్న తర్వాత దారిలొస్తుందనుకునే అమ్మాయికి ఎలాంటి అబద్ధాలు చెప్పాలి..అనే విషయాలను బాగా పట్టుకుంటారు. కొత్తగా ఇండస్ట్రీకొచ్చే అమ్మాయిలను..కొత్తగా దర్శకుడయ్యేవాడు..నిర్మాతగా మారిన వాడు ఊహించని విధంగా బొమ్మలేస్తాడు.
దాదాపు అమ్మాయిలందరు ఇలా చెపిన మాటలకి పడిపోతారు. గెస్ట్ హౌజ్ లో నెలలు నెలలు ఉండిపోతారు. ఈ సమయంలో దర్శక,నిర్మాత, హీరో వాళ్ళ స్నేహితులు..వరుసబెట్టి వాడేస్తుంటారు. హీరోయిన్ గా అవకాశం ఇవ్వకముందే వాడి సినిమా క్యాన్సిల్ అయిందని మొహం చాటేసే మహానుభావులు ఉన్నారు. ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ళ నుంచి ఈ తరహా బ్యాచ్ ఎక్కువైంది. కొన్ని పెద్ద సంస్థలలో కూడా అమ్మాయిలను వాడి వదిలేస్తున్నారు.
సినిమా అవకాశం అనగానే గుడ్డిగా నమ్మి దర్శకుడు చెప్పిందల్లా చేసి ఆ తర్వాత కక్కలేక మింగలేక ఉసూరుమంటూ వచ్చిన దారిన వెళ్ళేవాళ్ళ సంక్య ఎక్కువే ఉంటుంది. ఇక లేనా దేనా పద్ధతి పాటించేవారు అంత త్వరగా మోసపోవడం లేదు. ముందు షూటింగ్ మొదలయ్యాకే మీకు ఏది కావాలన్నా ఇచ్చేది..అప్పటివరకూ నో ఛాన్స్ అంటూ నిక్కచ్చిగా ఉంటున్నారు. ఆశ ఉన్నవాడు అవకాశం ఇచ్చి వాడుకుంటున్నారు. హీరోయిన్ ని అడ్డం పెట్టుకొని లక్షలు సంపాదించుకుంటున్న దర్శకులు లేకపోలేదు.