సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.. ఈమె సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్న సంగతి తెలిసిందే. మృణాల్ గతంలోని టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి డేటింగ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఈ అమ్మడు తాజాగా ముంబైలో జరిగిన శిల్పా శెట్టి దివాలి భాష్ కు హాజరైంది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆమె ఈ వీడియోలో ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. పైగా అతడు చేతిలో చేయి వేసి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యింది.. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదిక కూడా నెటిజన్ లు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఈ డేటింగ్ వార్తలపై బాద్ షా స్పందించాడు.
మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి… మీరు అనుకుంటున్నట్టు అలాంటిదేం లేదు అంటూ తన ఇన్స్టా స్టోరీ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు మృణాల్, బాద్ షా మధ్య ఉన్న రూమర్ల గురించే పెట్టాడని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మృణాల్ ఇటీవలే కిషన్ కట్టర్ తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన పెప్పా లో కనిపించింది. బి గ్రేడ్ ఇయర్ బలరాంసింగ్ మెహతా రచించిన ది బర్నింగ్ పుస్తకం ఆధారంగా రాజాకృష్ణ మేడం ఈ సినిమాను తెరకెక్కించారు.
అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 10న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇక మృణాల్ టాలీవుడ్ లో నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలలో నటిస్తోంది.