Moviesభ‌ర్త మ‌రో మ‌హిళ‌తో క‌నెక్ష‌న్ పెట్టుకోవ‌డం త‌ప్పుకాదు… సింగ‌ర్ చిన్మ‌యి రియాక్ష‌న్..!

భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో క‌నెక్ష‌న్ పెట్టుకోవ‌డం త‌ప్పుకాదు… సింగ‌ర్ చిన్మ‌యి రియాక్ష‌న్..!

టాలీవుడ్, కోలీవుడ్లో తిరుగులేని పాపులర్ సింగర్ అయిన చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ముందుగా చిన్నమయి పలు సినిమాల్లో సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమంతకు చిన్మయి వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది.. సేమ్ సమంత ఎలా మాట్లాడుతుందో చిన్నయి కూడా అలాగే డబ్బింగ్ చెప్పి పాపులర్ అయింది. ఆ తర్వాత సింగర్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో మంచి పాటలు పాడింది.

ఆ తర్వాత తెలుగువాడు అయినా దర్శకుడు రాహుల్ రవీంద్రను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చిన్నయి తన వృత్తి కంటే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ పోస్టులు కామెంట్లతో బాగా పాపులర్ అవుతూ ఉంటుంది. చాలా విషయాలపై తన‌దైన స్టైల్ లో స్పందిస్తుంది. అభిమానులు అడిగే పలు ప్రశ్నలకు ఆన్సర్లు కూడా ఇస్తుంది. ఇక మీ టు ఉద్యమం నేపథ్యంలో తనను ఎవరు ఎలా ? ఇబ్బంది పెట్టారో ఓపెన్ గానే స్పందించింది.

తాజాగా చిన్నయిని ఓ నెటిజన్ తన సమస్యపై స్పందించమని కోరగా చిన్మ‌యి ఈ షాకింగ్ రిప్లై ఇచ్చింది. సదరు నెటిజన్ హలో చిన్నయ్య గారు నా సమస్యను మీతో పంచుకుంటున్నాను… భార్య గర్భవతిగా ఉన్నప్పుడు లేదంటే డెలివరీ టైమ్ లో ఇతర కారణాల వల్ల భర్తతో ఫిజికల్గా కలవలేరు.. కాబట్టి వాళ్ళు బయట వాళ్లతో రిలేషన్ పెట్టుకోవడం లీగల్ అంట.. ఇంట్లో అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు నేనేం చేయలేకపోతున్నాను… తిరిగి అడిగితే ఓపిక పట్టాలి.. సర్దుకు పోవాలి అని నాకే రివర్స్‌లో చెప్తున్నారు అని ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు జన్మయి తన ఇన్స్టాలో స్ట్రాంగ్‌ ఆన్సర్ ఇచ్చింది. వీళ్లే సొసైటీలో నలుగురు ఇదే వాళ్ళ కల్చర్ ఇప్పుడు అర్థమవుతుందా ? ఈ నలుగురికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని అంటూ సలహా ఇచ్చింది. ప్రస్తుతం చిన్మయి పెట్టిన ఈ పోస్ట్ నిట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు, మహిళలు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news