బుల్లితెరపైనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ నడుస్తుంది. ఈ షో ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఫన్నీగా ఉంటుందో. ఎందుకంటే జనాలు తక్కువ ఓట్లు వేసిన వారి కన్నా జనాలను బకరాలను చేయడానికి బిగ్ బాస్ తమకు ఇష్టం లేని కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ ఉంటారు . ఈ తొమ్మిది వారాలు కూడా అదే ప్రక్రియ కొనసాగింది . అయితే రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ నుంచి తొమ్మిదవ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు .
హౌస్ లో ఇంకో నాలుగు వారాలు ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకు ఇది జీర్ణించుకోలేని విషయమే . అయితే హౌస్ లో గేమ్ ఆడిన విధానం పక్కన పెడితే మిగతా పనులన్నీ బాగానే చేశాడు. పలువురు కాంటెస్టెంట్లని నవ్వించడం సపోర్ట్ చేయడం అవసరమైనప్పుడు అగ్రెసివ్ నెస్ ను బయట పెట్టడం . ఫుడ్ మాత్రం కడుపునిండా తినడం బాగా చేశాడు టేస్టీ తేజ .
ఆఫ్ కోర్స్ తన పేరులోనే అది ఉంది . అయితే టేస్టీ తేజ ఫైనాన్స్ పొజిషన్ అందరికీ తెలిసిందే . పెద్దగా పాపులారిటీ కూడా లేదు. అయినా కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఇతడికి మంచిగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది . వారానికి 1.5 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్న తేజ మొత్తం తొమ్మిది వారాలకు గాను ఏకంగా 13.5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ఇతర సెలబ్రిటీస్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ రెమ్యూనరేషన్. కానీ టేస్టీ తేజకు 13 లక్షలు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ . ఈ 13 లక్షలు ఆయన కొన్ని సంవత్సరాలు కష్టపడితే కానీ రాదు ఇలా తొమ్మిది వారాలకే దక్కించుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అ, యితే మరికొన్ని వారలు హౌస్ లో ఉంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేదేమో బిగ్బాస్ టేస్టీ తేజ విషయంలో అన్యాయం చేసింది అంటూ మండిపడుతున్నారు అభిమానులు..!!