టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ రీసెంట్ గానే పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అందుకున్నాడు . అప్పటినుంచి సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా చిల్డ్రన్స్ డే సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు .
ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా మీడియా కంట కనపడిన బన్నీను రిపోర్టర్స్ “పిల్లలు పుట్టిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి ..?” అని ప్రశ్నించారు . ఈ క్రమంలోనే బన్నీ స్టన్నింగ్ ఆన్సర్ ఇచ్చారు . బన్ని మాట్లాడుతూ ..”పిల్లల పుట్టకముందు నేను ఒకలా ఉన్నాను ..పుట్టాక మరొకలా ఉన్నాను. నిజానికి పెళ్లి కాకముందు నేను బూతులు ఎక్కువగా మాట్లాడే వాడిని.. నాకు ఇష్టం వచ్చినట్లు తిరిగేసేవాడిని .. అయితే పెళ్లి అయ్యి..పిల్లలు పుట్టాక రూల్స్ రెగ్యులేషన్స్ టోటల్గా మారిపోయాయి”..
” బూతు మాటలు అస్సలు మాట్లాడటం లేదు ..అంతేకాదు ఫుడ్ విషయం ..వే ఆఫ్ బిహేవియర్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి” అని చెప్పుకు వచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు స్నేహారెడ్డి టోటల్గా బన్నీని బాగానే కంట్రోల్లో పెట్టింది అంటూ పలువురు ఫన్నీగా కూడా కామెంట్స్ చేస్తున్నారు..!!