Newsబాల‌య్య 109 ప‌వ‌ర్ ఫుల్‌గా... బ్లడ్ బాత్‌కి బ్రాండ్ నేమ్... న‌రుకుడు...

బాల‌య్య 109 ప‌వ‌ర్ ఫుల్‌గా… బ్లడ్ బాత్‌కి బ్రాండ్ నేమ్… న‌రుకుడు షురూ…!

నందమూరి నట‌సింహం బాల‌కృష్ణ‌ హీరోగా నటించిన తాజా సినిమా భగవంత్ కేసరి. తన కెరీర్‌లో 30 ఏళ్ల తర్వాత తొలిసారి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య.. తాజాగా దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాలో బాలయ్య నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాబి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై అంచనాలకు మామూలుగా లేవు. ఇటు బాబీతో పాటు.. అటు బాలయ్య ఇద్దరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో కచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. తాజాగా ఈ రోజు ఈ సినిమా నుంచి ఓ పవర్ఫుల్ పోస్టర్ తో షూటింగ్ షురూ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇందులో గొడ్డలి, రేబాన్‌ కళ్ళజోడు అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తో.. మేకర్ సినిమాలోని యాక్షన్ ఏ రేంజ్‌లో ? ఉంటుందో చెప్పకనే చెప్పేశారు. భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ లుక్ చూస్తే లైట్ గా గడ్డం ఉంటుంది. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ గడ్డం మైంటైన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం లుక్ మార్చారు. క్లీన్ షేవ్ చేశారు. ఇంతకుముందే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనప్పుడు ఓ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఎన్బీకే 109 కాన్సెప్ట్ పోస్టర్‌లో మారణాయుధాలు చాలా ఉన్నాయి. దీనికి తోడు వైలెన్స్ కి విజిటింగ్ కార్డు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. కత్తితో పాటు సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది కూడా మేన్ష‌న్‌హౌస్ బాటిల్ కావడం విశేషం. అలాగే సిగరెట్‌తో పాటు డబ్బులకు కూడా చోటు కల్పించారు. ఏది ఏమైనా ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇక తెరమీద బాలకృష్ణ విధ్వంసం ఎలా ఉంటుందో ? చూడటం ఒకటే మిగిలి ఉంది. వచ్చే సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news