టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో ముందు నుంచి రకరకాల గందరగోళాలు ఉన్నాయి. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఆకాశంలోనే ఉండాలి.. అయితే ఈ సినిమా మొదలైనప్పుడు ఉన్న అంచనాలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సినిమా షూటింగ్‌కు ఎప్పుడు ఏదో ఒక అవాంతరం ఎదురవుతూ వస్తోంది.
దీనికి తోడు మహేష్ ఇంట్లో జరిగిన సంఘటనల వల్ల కూడా గుంటూరు కారం షూటింగ్ ఆలస్యం అయింది. సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్లు మారటం.. ఒకరిద్దరూ టెక్నీషియన్లు మారడంతో.. కూడా సినిమా షూటింగుకు బ్రేక్ పడింది. దీనికి తోడు కథ కూడా అనుకున్నట్టుగా రాకపోవడం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో మహేష్ – త్రివిక్రమ్ మధ్య గ్యాప్ రావడం.. ఇలా ఈ సినిమాకు ఎప్పుడూ ఏదో ?ఒక ఇబ్బంది ఎదురవుతూ వస్తోంది.
శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్ లాంటి భారీ తారాగణం ఉండడంతో సినిమాపై అంచనాలు ఉన్నా.. అందుకు తగినట్టుగా త్రివిక్రమ్ ఫ్రీ ప్లాన్‌గా ప్రమోషన్లు అయితే చేయలేదని అంటున్నారు. అదే అల వైకుంఠపురం సినిమా విషయంలో ముందు నుంచి చాలా ప్లానింగ్ తో వ్యవహరించారు త్రివిక్రమ్. ఆ సినిమాపై పెట్టిన శ్రద్ధ, ప్రేమ గుంటూరు కారం విషయంలో లేవనే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
అల వైకుంఠపురం సినిమా విషయంలో ముందుగా ఒక్కోసాంగ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి సాంగ్‌కు మధ్య గ్యాప్ ఉండేలా చూసుకున్నారు. ప్రతి సాంగ్ కూడా సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అయింది. ఆ సినిమా నుంచి ఏ స్టిల్ వచ్చినా.. ఏ సాంగ్ వచ్చినా.. సినిమాపై ఉన్న హైప్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. గుంటూరు కారం విషయంలో మాత్రం అలాంటిదేం కనిపించడం లేదని మహేష్ అభిమానులు బాగా ఫీలవుతున్నారు.
విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా ఈనెల 7న గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అంటే తన బర్త్‌డే ని కూడా త్రివిక్రమ్ ఈ విధంగా హైలెట్ చేసుకుంటున్నాడు అంటూ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఏది ఏమైనా అలవైకుంఠపురం సినిమాకు వచ్చినంత హైప్ అయితే గుంటూరు కారంకు రావడం లేదు. మరి రేపు సినిమా రిలీజ్ అయ్యాక త్రివిక్రమ్ ఏం చేస్తాడో ? మహేష్ ను ముంచుతాడా..? తేలుస్తాడా..? అనేది చూడాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.