ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే విషయం హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది. టాలీవుడ్ లో బ్యానర్లకు ఒక వేల్యూ ఉంటుంది. క్రేజ్ ఉంటుంది. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. దిల్ రాజు బ్యానర్ అంటే ఒక క్రేజ్, అలాగే సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, యూవీ క్రియేషన్స్, మైత్రి మూవీస్ లాంటి బ్యానర్లకు ఆ సంస్థలు నిర్మించే సినిమాలకు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో బాగా పాపులర్ అవుతున్న పీపుల్స్ మీడియా బ్యానర్ పేరు మరోలా వైరల్ అవుతుంది. ఈ సంస్థ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే చాలామంది టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఈ బ్యానర్లో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.
ఏ డైరెక్టర్ అయినా ఒక హీరోకు కథ చెప్పి ఓకే చేయించుకుంటే.. వెంటనే పీపుల్స్ మీడియాలో చేద్దాం అంటున్నారట. అదేంటి అందరూ ఆ బ్యానర్ పేరు ఎందుకు ? చెబుతున్నారు అంటే చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. పీపుల్స్ మీడియాలో నిర్మించే సినిమాల షూటింగ్ టైంలో నిర్మాతలు చాలా మెత్తటి వైఖరితో ఉంటారట. సినిమాకు ఎంత ఖర్చు పెడుతున్నా ? ఏమాత్రం పట్టించుకోరని అంటున్నారు. శ్రీవాస్, గోపీచంద్ లాంటి అంచనాలులో లేని ప్రాజెక్టుకు రూ.35 కోట్లకు పైగా ఖర్చు చేశారు. రామబాణం సినిమా ఎంత డిజాస్టర్ అయిందో చూశాం.
శర్వానంద్ – శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్లో వస్తున్న సినిమాకు రూ.45 కోట్లకు పైగా ఖర్చయినట్టు తెలుస్తోంది. కారణం ఒక్కటే దర్శకుడు సినిమాకు ఎంత ఖర్చు చేయించాలనుకున్నా ఆ ఫ్రీడమ్ పీపుల్స్ మీడియా దగ్గర దొరుకుతుంది. ఇంకేముంది హీరో, దర్శకుడు కలిసి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ షూటింగ్ చేసినా అడిగేవాళ్లు లేరు. పట్టించుకునే వాళ్ళు ఉండరు. పైగా నిర్వహకులు హీరోల రెమ్యూనరేషన్ దగ్గర అస్సలు బేరాలు ఆడరు అని టాక్ ఉంది.
ఆ మధ్య ఓ టాప్ హీరో సినిమాకు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ అనుకుని రూ.65 కోట్లు ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆ సినిమా కూడా వాళ్లకు లాభాలు తెచ్చి పెట్టలేదు. అయితే ఇప్పుడు పీపుల్స్ మీడియా కూడా కాస్ట్ కటింగ్ ఖర్చు ఎలా తగ్గించుకోవాలి ? అనే విషయాలపై దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో నిర్మాతలు సరిగా లేకపోతే హీరోలు, దర్శకులు మరి మీద ఎక్కేస్తూ ఉంటారు. ఫైనల్ గా అది నిర్మాతలకే భారీ నష్టం కలిగిస్తుంది.