ఊర్మిళ మతోండ్కర్..ఒకప్పుడు సంచలన దర్శకుడు రాంగోపాల్ రిలేషన్ మేయిన్‌టైన్ చేసిన హీరోయిన్. ఆర్జీవీ తలుచుకుంటే ఏ హీరోయిన్‌నైనా ఫేమస్ అయ్యేలా చేయగలడు. అలా ఆయన సినిమా ద్వారా స్టార్ అయిన హీరోయిన్ ఊర్మిళ. ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా ఓ మరాఠి సినిమాలో నటించింది. అదే ఆమె మొదటి సినిమా. తెలుగు, తమిళం, మలయాళం కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసింది.
1981లో కలియుగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 1983 లో మాసూం సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. దాంతో ఊర్మిళకి బాలీవుడ్ సినిమాల్లో వరుసగా అవకాశాలు అందాయి. ఇక 1989 లో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఊర్మిళ చాణక్యన్ సినిమాతో అక్కడ బాగా ఫేమస్ అయింది. అదే సమయంలో హిందీలో నటించిన నరసింహా అనే సినిమాలోనూ నటించింది. ఈ రెండు సినిమాలతో ఊర్మిళ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది.
కానీ, ఆ తర్వాత చేసిన ఏ సినిమా కూడా ఊర్మిళకి సక్సెస్ ని ఇవ్వలేదు. అయితే, అప్పటికే, కొన్ని సినిమాలు చూసిన ఆర్జీవీ ఊర్మిళకి రంగీలా సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో కొంత కాలం ఊర్మిళ ఓ వెలుగు వెలిగింది. జుదాయీ, సత్య సినిమాలు ఊర్మిళని మంచి స్టార్ ని చేశాయి. ఈ క్రెడిట్ అంతా ఆర్జీవీతే. కానీ, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే రంగీలా సినిమాకి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
ఆయన మ్యూజిక్ వల్లే ఊర్మిళకి అంతటి స్టార్ డం వచ్చిందని స్వయంగా ఆర్జీవీ చెప్పడం పెద్ద షాకింగ్ విషయం. ఇది నమ్మడం కష్టమే అయినా కొన్ని సినిమాలు కొంతమందికి అలాగే కలిసొస్తాయి. కథ, కథనం బాగాలేకపోయినా కేవలం మ్యూజిక్ వల్ల 100 రోజులు ఆడిన సినిమాలు మన తెలుగులోనే బోలెడు ఉన్నాయి. ఇది తెలిస్తే ఆర్జీవీ చెప్పింది నిజమని నమ్మొచ్చు. ఈ క్రేజ్ వల్లే తెలుగులో అంతం, గాయం, అనగనక ఒకరోజు లాంటి మంచి సినిమాలు చేసింది.