సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అనుష్కల పెళ్లి మేటర్ . వీళ్ళు ప్రేమించుకుంటున్నారు అని పెళ్లి చేసుకోబోతున్నారు అని .. గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి . వీళ్ళు మేము ప్రేమికులు కాదు ఫ్రెండ్స్ రా బాబోయ్ అంటూ నెత్తి నోరు మొత్తుకున్న కూడా ఇదిగో అనుష్క ప్రభాస్ ల పెళ్లి.. రేపే ముహూర్తం.. ఎల్లుండే శోభనం అంటూ రాతలు రాసేస్తున్నారు కొందరు జనాలు .
ఇలాంటి క్రమంలోనే అనుష్క.. ప్రభాస్ కంటే ముందు ప్రేమించిన హీరో పేరు నెట్టింట వైరల్ అవుతుంది. అనుష్క ఇండస్ట్రీలో కి సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాలో ఆమె నటన అదుర్స్ . అంతేకాదు చాలా హాట్ గా కనిపించింది . అయితే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది. అరుంధతి సినిమాతో ఏకంగా టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ దక్కించుకుంది.
అయితే అనుష్క అప్పటికే నాగార్జునతో ప్రేమాయణం నడిపింది అని .. సూపర్ సినిమా హిట్ అయ్యాక ఆయనపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది అని కానీ పెళ్లయిపోయిన హీరో పై ప్రేమ ఏంటి అంటూ తనకు తానే సర్దు చెప్పుకొని సైలెంట్ అయిపోయిందట. కానీ ఇప్పటికీ ఆమె ఫస్ట్ లవ్ అంటే మాత్రం నాగార్జున అనే అని జనాలు చెప్పుకుంటున్నారు . అంతేకాదు డాన్ సినిమాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవ్వరైనా సరే ఇలా వైరల్ అయ్యే వార్తలను నిజమని నమ్మక తప్పదు . అలా ప్రభాస్ స్థానం రెండోది నాగార్జున స్థానం ఒకటోది అంటూ కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు..!!