సందీప్ రెడ్డి వంగాది చాలా డిఫరెంట్ స్టైల్. ఒక హిట్ సినిమా వచ్చింది కదా అని పరుగులు పెట్టడు. లేదంటే అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ కు తెలుగులో వచ్చిన క్రేజ్‌కి ఈపాటికి రెండు, మూడు సినిమాలు చేసి ఉండేవాడు. కానీ తనకు నచ్చిన దారిలోనే వెళుతున్నాడు. తన కొత్త సినిమా యానిమల్ ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది. అయితే ఈ సినిమా రన్ టైం విషయంలో అందరూ షాక్ అవుతున్నారు. మొత్తం ఈ సినిమా నిడివి నాలుగు గంటలు వచ్చిందట. అటు చేసి ఇటు చేసి మూడున్నర గంటలకు రన్ టైం తగ్గించారట.
ఈరోజుల్లో రెండున్నర గంటల సినిమా అంటేనే వామ్మో అంటున్నారు. అలాంటిది మూడున్నర గంటలపాటు సినిమా చూడటం అంటే చాలా పెద్ద రిస్క్. సినిమా నిడివి తగ్గించమని ఎవరు ఎన్ని ? చెప్పినా సందీప్ మాత్రం అస్సలు వినడం లేదట. నేను రన్ టైం తగ్గించను.. సినిమా సీన్లు కట్ చేస్తే సినిమా కనెక్షన్ మిస్ అవుతుంది.. సినిమా సోల్ మిస్ అవుతుంది. నేను అలా చేయను అని నిర్మాతలకు తెగేసి చెప్పాడట. చివరికి అటు చేసి ఇటు చేసి మరో పావుగంట కత్తిరించి మూడు గంటల 15 నిమిషాలుగా రన్ టైం ఫిక్స్ చేశారు.
ఇక విజయ్ దేవరకొండ తో సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా నిడివి కూడా ఇంతే ఉంటుంది. నిడివి పరంగా చూస్తే అర్జున్ రెడ్డి చాలా లాంగ్ రన్ టైం ఉన్న సినిమాయే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగా క్లిక్ అయింది. రన్ టైం కాస్త ఎక్కువ అయినా అర్జున్‌రెడ్డిని మాత్రం అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. నిజానికి ఈ రోజుల్లో ఇంతింత ఫుటేజ్ ఉంటే దాన్ని ఇంకా స్థాపించి రెండు భాగాలుగా తీస్తూ ఉంటారు. ఈ ఐడియా యానిమల్ సినిమా నిర్మాతలకు కూడా వచ్చింది.
అయితే తొలి భాగానికి కామా పెట్టడానికి సరైన ప్లేస్మెంట్ దొరకలేదట. అందుకే ఈ సినిమాని ఒకే భాగంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా 195 నిమిషాల రన్ టైం అంటే చాలా పెద్ద రిస్క్. అయితే సందీప్ రెడ్డికి సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ రిస్క్ చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది.